Friday, May 3, 2024

యుపిలో దారుణం..

- Advertisement -
- Advertisement -

బండా : ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అమానుషం చోటుచేసుకుంది. ఓ 40 సంవత్సరాల దళిత మహిళపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేశారు. తరువాత శవాన్ని ముక్కలు చేసి పారేశారు. ఈ ఘటన గురించి పోలీసులు శుక్రవారం తెలియచేశారు. మంగళవారం ఈ హత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. మంగళవారం గిర్వాన్‌లో ఈ మహిళ ఫ్లోర్‌మిల్లు శుభ్రం చేసేందుకు స్థానిక రాజ్‌కుమార్ శుక్లా నివాసానికి వెళ్లింది. కొద్ది సేపటి తరువాత ఈ మహిళ 20 ఏండ్ల కూతురు అక్కడికి వెళ్లింది. అప్పుడే అక్కడి గదిలో నుంచి తల్లి కేకలు విన్పించాయి. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. కొద్ది సేపటి తరువాత తలుపులు తీసుకుని లోపలికి వెళ్లగా మహిళ చనిపోయి మూడు ముక్కలుగా పడి ఉందని స్థానిక పోలీసు స్టేషన్ అధికారి సందీప్ తివారీ తెలిపారు.

వెంటనే కూతురు ఫిర్యాదు మేరకు శుక్లా సోదరులు ముగ్గురుపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నిందితులు ఫరారీలో ఉన్నారు. ఇప్పటివరకూ ఎటువంటి అరెస్టులు జరగలేదు. ఘటనపై సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. యుపిలోని దళిత మహిళలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరిగిన సంఘటన అత్యంత హృదయవిదారకం అని, ఇటువంటి వాటితో యుపి మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని, ఈ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల ఐఐటి భూలో చదివే విద్యార్థినిని కొందరు అటకాయించి వివస్త్రను చేసి ఈ ఉదంతాన్ని వీడియో చేసి సామాజిక మాధ్యమాలలో పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనం అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News