Thursday, May 2, 2024

దంతేవాడ పేలుడుకు 2 నెలల క్రితమే..

- Advertisement -
- Advertisement -

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో డిఆర్‌జి దళాలపై మావోయిస్టులు పక్కా ప్రణాళికలతోనే దాడి చేసినట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.దర్యాప్తు జరిగిన కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ రహదారిపై వెళ్లే వాహనాల సమాచారం పక్కాగా మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరినట్లు భావిస్తున్నారు. దీంతో పాటుగా ఐఇడిలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సొరంగాన్ని తవ్వినట్లు అనుమానిస్తున్నారు. ఐఇడిని రెండు నెలల క్రితమే ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొంతకాలంగా దూకుడుగా ఉన్నట్లు భద్రతా దళాలకు ముందునుంచే సమాచారం ఉంది. ఈ నెల 18న గంగలూరుపడ్డేడ రోడ్డుపై బిజాపూర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ విక్రమ్ ముండావి కాన్వాయ్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

అయితే అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరు కూడా గాయపడలేదు.ఇదిలా ఉండగా డిఆర్‌జి దళాలపై దాడికి మావోయిస్టులు వాడిన ఐఇడిలను రెండు నెలల క్రితమే అరన్‌పుర్‌జగర్‌గుండ రోడ్డుకింద అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బస్తర్ రేంజ్ పోలీసు ఐజి పి సుందర్ రాజ్ మీడియాకు వెల్లడించారు. ఐఇడిని పేల్చేందుకు అమర్చిన వైరుపై మట్టివేసి కప్పి ఉంచినందున దానిపై గడ్డి కూడా మొలిచిందని, అందువల్ల పోలీసులు అంచనా వేయలేకపోయారని ఐజి తెలిపారు. భద్రతా దళాల కదలికలపై స్పష్టమైన సమాచారం వచ్చాకే అరన్‌పుర్‌జగర్‌గుండ రోడ్డుపక్కనుంచి సొరంగాన్ని తవ్వినట్లు తెలుస్తోంది. వీటిని ఫాక్స్‌హోల్స్‌గా పిలుస్తారు. అనంతరం దాదాపు 40నుంచి 50 కిలోల బరువైన ఐఇడిలను అమర్చారు. వీటిని పేల్చడానికి అనువుగా వైరును రోడ్డుపక్కనుంచి కొన్నిమీటర్ల్ల దూరంలోని పొదలవరకు విస్తరించారు.

Also Read: భట్టి పాదయాత్రలో ఘర్షణ..

అక్కడ కాపుకాచి డిఆర్‌జి బృందం ప్రయాణిస్తున్న వాహనం రాగానే పేల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆంగ్లపత్రిక కథనాలు మాత్రం ఐఇడిలను రెండు రోజుల క్రితమే అమర్చినట్లు చెబుతున్నాయి. కాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉల్లంఘన ఏదైనా జరిగింది అని అడగ్గా, భద్రతాదళాలు నిబంధనలను పాటించినట్లు డిజి చెప్పారు.‘ దర్భా డివిజన్ దళానికి చెందిన నక్సల్స్ ఉనికికి సంబంధించిన పక్కా సమాచారం అందిన తర్వాత ఆపరేషన్ చేపట్టడం జరిగింది. బుధవారం ఉదయం అరన్‌పూర్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో నక్సల్స్‌కు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ను పట్టుకున్నాం. వారిలో ఒకరికి గాయాలయ్యాయి’ అని ఆయన చెప్పారు.

దరిమిలా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది గాలింపులు కొనసాగిస్తుండగా అరన్‌పూర్‌నుంచి ఎనిమిది వాహనాల్లో డిఆర్‌జి బృందం బయలుదేరిందని ఆయన చెప్పారు. ‘పట్టుకున్న నక్సల్స్‌ను కాన్వాయ్‌లోని మొదటి వాహనంలో తీసుకు వస్తున్నారు. కాన్వాయ్‌లాగా కనిపించకుండా ఉండడం కోసం వాహనానికి వాహనానికి మధ్య చాలా దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే నక్సల్స్ పది మంది భద్రతా జవాన్లు ఉన్న రెండో వాహనాన్ని టార్గెట్ చేశారు’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News