Sunday, April 28, 2024

హెగ్డేవార్ కందకుర్తి ప్రస్తావన ఆంతర్యం ఏమిటి?

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పార్లమెంటు వేదికగా టిపిసిసి అధ్యక్షుడు, లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌ని ఎందుకు స్మరించుకుంటున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హెడ్గేవార్ తెలంగాణలోని కందకుర్తి గ్రామానికి చెందినవారని గుర్తు చేయడం, పునరుద్ఘాటించడంలో రేవంత్ ఉద్దేశం ఏమిటని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించా రు. పార్లమెంట్ వేదికపై హెడ్గేవార్ గురించి మాట్లాడడం చూస్తే మీరు నరేంద్ర మోడీ, అమిత్ షాలను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అ నే సందేహం వ్యక్తం చేశారు. హెడ్గేవార్ తెలంగాణకు చెందిన వ్యక్తి అనే సెంటిమెంట్‌ను ప్రచారం చేస్తూ తెలంగాణలో బిజెపికి రహస్యంగా స హాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారా అని దాసోజు ప్రశ్నించారు. రే వంత్ కుటిల రాజకీయాలు, కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ అధిష్టానం గ్ర హించాలని, ఈ విషయంపై ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి మణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ లు రేవంత్ రెడ్డి రహస్యంగా, బహిరంగంగా ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో గ్ర హించాలని సూచించారు. రేవంత్ తెలంగాణకు నాయకత్వం వ హించడానికి తగినవాడా లేదా ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి సందేహాస్పద పాత్రపై తెలంగాణ ప్రజలకు, నిజమైన క్యాడర్‌కు, నాయకులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పార్లమెంటు సాక్షిగా బిజెపి ఎంపిలు పచ్చి అబద్దాలాడటం సిగ్గు చేటు కాక మరేమిటని బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని బిజెపి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం సిఎం కెసిఆర్ ఆలోచన అని పేర్కొంటూ, వివిధ ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణం మొత్తంతో సదరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది తప్పితే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని స్పష్టం చేశారు.

అయితే, భారత ప్రభుత్వం రూ.86,000 కోట్లు మంజూరు చేసిందని బిజెపి ఎంపి నిషికాంత్ దూబె దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. పార్లమెంటులో ఇంత పచ్చి అబద్ధాన్ని చెప్పడం విశ్వాసాన్ని ఉల్లంఘించడమేనని, సదరు బిజెపి ఎంపికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను తీసుకురావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా తెలంగాణ బిజెపి ఎంపిలు కూడా పార్లమెంటులో తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
భగ్గుమంటున్న బిఆర్‌ఎస్ ఎంపిలు, తెలంగాణ నేతలు
పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బిజెపి ఎంపి బుధవారం పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు వల్లించడంపై బిఆర్‌ఎస్ ఎంపిలు, తెలంగాణ బిఆర్‌ఎస్ నేతలు భగ్టుమంటున్నారు. బిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ కేంద్ర ప్రభుత్వాన్ని దగాకోరు ప్రభుత్వంగా అభివర్ణిం చారు. దీనికి సంబంధించి సదరు బిజెపి ఎంపిపై గురువారం ప్రివిలేజ్ మేషన్‌ను ప్రవేశపెట్టేలా బిజెపి ఎంపిలు కసరత్తులు షురూ చేశారు. బిజెపి ప్రభుత్వం నిసిగ్గుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అవాకులు, చవాకులు పేలడాన్ని అటు బిఆర్‌ఎస్ ఎంపిలు, ఇటు తెలంగాణ బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బిజెపి ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని వారు చెబుతున్నారు.

సొంత నిధులతో కాళ్వేరం ప్రాజెక్టు నిర్మాణమన్న మరో కేంద్ర మంత్రి
కాగా, సొంత నిధులతోనే తెలంగాణ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నారంటూ జూలై 22, 2021న ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటు సాక్షిగా జలశక్తి శాఖ మంత్రి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంపిలు, తెలంగాణ బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ విషయాన్ని విస్మరించి మరలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బుధవారం పార్లమెంటు సాక్షిగా బిజెపి నిషికాంత్ దూబే కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.86 వేల కోట్లు మంజూరు చేసిందని నిస్సిగ్గుగా ప్రకటించడం పట్ల బిజెపి ఎంపిలు, తెలంగాణ బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పాబడుతున్నారు. ఇదే విషయంలో తెలంగాణ బిజెపి ఎంపిలు నోరు మెదపని తీరును సైతం వారు గర్హిస్తున్నారు. ఇక దీనిపై సమరమేనంటూ బిజెపి ఎంపిలు ప్రతిన బూనుతూ పార్లమెంటులో ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్‌ను గురువారం ప్రవేశపెట్టనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News