Thursday, May 2, 2024

కరోనా… తండ్రి చితిలో దూకిన కూతురు…

- Advertisement -
- Advertisement -

Daughter jumps into Covid victims pyre

 

జైపూర్: కరోనా వైరస్‌తో చనిపోయిన తండ్రి చితిలో దూకి కూతురు గాయపడిన సంఘటన సంఘటన రాజస్థాన్‌లోని బర్మార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజ్ కాలనీలో ఉండే దామోదర్ దాస్ మహేశ్వరి అనే(70) వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. దామోదర్‌కు కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులలో చంద్రకళ(33) అనే కూతురికి కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుంది. దామోదర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చనిపోయాడు. కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం దామోదర్ మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి ముగ్గురు కూతుళ్లకు అనుమతి ఇచ్చారు. చంద్ర కళకు కరోనా పాజిటివ్ కావడంతో శ్మశాన వాటికకు రావొద్దని సిబ్బంది హెచ్చరించారు. కానీ ఆమె వాళ్లతో గొడవపెట్టుకొని తండ్రి చితికి వద్దకు వెళ్లింది. మృతదేహానికి మంటలు అంటించగానే తన తండ్రి చితిపై చంద్రకళ దూకింది. అనంతరం ఆమె చెల్లెలు ప్రీతి చంద్రకళను బయటకు లాగింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శరీరం 70 శాతం కాలిపోవడంతో జోధ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చంద్రకళకు తన తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉండడంతో ఇలా చేసి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News