Monday, May 13, 2024

నేడు ఢిల్లీతో చెన్నై ఢీ

- Advertisement -
- Advertisement -

DC vs CSK match in IPL 14 today

 

తొలి పోరు నేడే

ముంబై: ఐపిఎల్14లో భాగంగా శనివారం జరిగే రెండో మ్యాచ్‌కు కిందటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) సిద్ధమయ్యాయి. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఢిల్లీతో పోల్చితే చెన్నైలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. కెప్టెన్ ధోనీకి ఈ సీజన్ చాలా కీలకంగా మారింది. కిందటిసారి సిఎస్‌కె అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఇక ధోనీ కెరీర్‌లో ఇదే చివరి ఐపిఎల్‌గా భావిస్తున్నారు. దీంతో ఈసారి జట్టుకు ట్రోఫీని అందించడం ద్వారా ఐపిఎల్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని ధోనీ భావిస్తున్నాడు. ఇక ఐపిఎల్ స్పెషలీస్ట్ సురేశ్ రైనా చేరికతో చెన్నై మరింత పటిష్టంగా తయారైంది. ఐపిఎల్‌లో కళ్లు చెదిరే రికార్డు కలిగిన సురేశ్ రైనా ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అతని సొంతం. ఇక డుప్లెసిస్, అంబటి రాయుడు, కృష్ణప్ప గౌతం, మొయిన్ అలీ, బ్రావో, రవీంద్ర జడేజా తదితరులతో చెన్నై చాలా బలంగా కనిపిస్తోంది. ఎలాంటి జట్టునైనా అలవోకగా ఓడించే సత్తా సిఎస్‌కెకు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీని కూడా తక్కువ అంచనా వేయలేం. పృథ్వీషా, ధావన్, పంత్, రహానె, అశ్విన్, అక్షర్ తదితరులతో ఢిల్లీ కూడా చాలా బలంగా ఉంది. ఈసారి కూడా పంత్ జట్టుకు చాలా కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన పంత్ విజృంభిస్తే ఢిల్లీకి విజయం నల్లేరుపై నడకే. మరోవైపు ధావన్, పృథ్వీషాలు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలో పృథ్వీషా పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఇక స్టీవ్ స్మిత్ రూపంలో అత్యంత కీలకమైన ఆటగాడు ఉండనే ఉన్నాడు. స్మిత్‌పై ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు స్టోయినిస్, శామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా ఢిల్లీకి అందుబాటులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News