Sunday, April 28, 2024

నల్లా మీటర్లకు గడువు పది రోజులే..

- Advertisement -
- Advertisement -

deadline for water meters is ten days in hyderabad

ఈనెల 31లోగా ఆధార్, మీటర్లు అనుసంధానం
తప్పనిసరి

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి సంక్రాంతి పండుగ కానుకగా పథకంగా మున్సిఫల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ పథకం ప్రారంభించారు. గృహ యాజమానులు కనెక్షన్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకుని మీటర్లు బిగించుకోవాలని సూచించి 20వేల లీటర్లకంటే నీరు ఎక్కువ వినియోగిస్తే బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా మీటర్లు పెట్టుకున్నవారే ఈపథకాని వర్తిస్తారని చెప్పారు. కానీ పథకం ప్రారంభించి సుమారు రెండు నెలలు దాటిన అధార్, మీటర్లు అనుసంధానం చేసుకునేందుకు నగర ప్రజలు ముందుకు రావడం రాలేదని, గడువు 10 రోజులే ఉందని జలమండలి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. లబ్దిదారులు పథకానికి డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు 1.96లక్షలు, డొమిస్టిక్ వినియోగదారులు 7.87 లక్షలు, డొమెస్టిక్, ఆపార్టుమెంట్లు, డొమెస్టిక్ బల్క్ 24, 967 మొత్తం 10.08 లక్షల మంది పథకానికి అర్హులన్ని బోర్డు ప్రకటించింది.

ఎక్కువ కనెక్షన్లు డొమెస్టిక్ వినియోగదారులవే ఉండగా వాటిలో ఇప్పటివరకు 1.50 లక్షల మంది ఆధార్ అనుసంధానం, మీటర్లు బిగింపుకు ముందుకు వచ్చినట్లు బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. జలమండలి ప్రతి డివిజన్‌కు 2 ఏజెన్సీల చొప్పన 15ఎంఎం, 20ఎంఎం సైజు మెకానికల్ మీటర్ల సరఫరా, మీటర్ బిగింపు కోసం 24 ఏజెన్సీలు బాధ్యతలు అప్పగించి 15ఎంఎం మీటర్ సైజు రూ. 1498, 20ఎంఎం రూ. 2147 చెల్లించి ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంటున్నారు. బోర్డు సూచించిన విధంగా సకాలంలో మీటర్లు బిగించుకుని ఉచిత నీరు పొందాలని, ఆలస్యం చేస్తే పథకంలో అర్హులుగా పొందలేరని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డొమెస్టిక్ వినియోగదారులు బహుళ అంతస్తుల భవనం, బల్క్ కనెక్షన్ దారులు డిసెంబర్ 1వ తేదీ 2020 నాటికి పంక్షనల్ మీటర్లతో ఉండి,వారు తమ ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఏప్రిల్ 1, 2021లోపు పూర్తి చేసిన వారికి ఒకేసారి 4నెలలకుగాను దానికి సంబంధించిన బిల్లులు జారీ చేస్తామని, ప్రతినెల 20వేల లీటర్ల లోపు వాడిని వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు.

నీటి వినియోగం నెలకు 20వేల లీటర్లకు మించితే అదనపు వినియోగానికి బోర్డు టారిప్ ప్రకారం బిల్లు చెల్లించాలని బోర్డు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. డొమెస్టిక్ స్లమ్ కనెక్షన్లకు ఆధార్ ప్రక్రియను పూర్తి చేసేందుకు 165మంది మీటర్ రీడర్లను నియమించినట్లు, మిగతా కేటగిరీల వారు స్వయంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువులోగా ఆధార్ అనుసంధాం,మీటర్ బిగించకుంటే డిసెంబర్ నుంచి గతంలో ఏవిధంగా బిల్లు వచ్చాయో అదే విధంగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News