Saturday, April 27, 2024

తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టిన ఎహెచ్‌టియూ

- Advertisement -
- Advertisement -

Anti-Human Trafficking Unit rescued 32 victims

32 మంది పిల్లల జాడ తెలుకున్న
సైబరాబాద్ పోలీసులు
ఆపరేషన్ స్మైల్ 7లో యాంటీ హ్యుమన్
ట్రాఫికింగ్ యూనిట్

హైదరాబాద్: కొన్ని ఏళ్ల క్రితం తప్పిపోయిన వారి ఆచూకీ సైబరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు కనుగొన్నారు. గత కొన్ని ఏళ్ల క్రితం తప్పిపోయిన వారు తమ తల్లిదండ్రుల ఆచూకీ తెలియకుండా వసతి గృహాల్లో ఉంటున్నారు. ఇలా ఏళ్ల నుం చి ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 32మంది వారి వివరా లు తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందులో వెస్ట్‌బెంగాల్‌కు చెందినా వారు 7, మహారాష్ట్రకు చెందిన వా రు 7, తెలంగాణ వారు 4, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 3, కర్నాటక వారు 7, ఢిల్లీకి చెందిన వారు 4మంది ఉన్నా రు. ఆపరేషన్ స్మైల్ 7లో భాగంగా జనవరి, 2021లో చేపట్టిన కార్యక్రమంలో ఇంటి నుంచి తప్పిపోయి బెగ్గింగ్, చిత్తుకాగితాలు ఏరుకునేవారు, బాలకార్మికుల ఆచూకీ కనిపెట్టారు.

రెండేళ్లప్పుడు తప్పిపోయింది..17 ఏళ్లకు ఆచూకీ..

ఎపిలోని కర్నూలు జిల్లా, సిరివిళ్లా మండలం, ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన బాలిక 2005లో నగరానికి తల్లిదండ్రులతో వచ్చింది. చార్మినార్ వద్ద బాలిక తప్పిపోయినప్పుడు వయస్సు 2 1/2 ఏళ్లు బాలికను ఉమెన్ సేఫ్టీ వింగ్ బోడుప్పల్ హ్యాపీ హోంకు తరలించారు. తర్వాత బాలిక మియాపూర్‌లోని వివేకానంద హోంలో చేరింది. ఇప్పడు బాలిక వయస్సు 17 సంవత్సరాలు. కేసు వివరాలు తెలుసుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను కలిసి చిన్ననాటి ఫొటోలు చూపించారు. బాలిక తల్లిదండ్రులు నగరంలోని వివేకానంద హోంకు వచ్చి ఐడెంటిఫికేషన్ మార్క్ ఆధారంగా తమ కూతురిని గుర్తించారు.

మీరట్ బాలిక తెలంగాణలో..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్ జిల్లా, గంగానగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాలిక(14) ఈ ఏడాది కన్పించకుం డా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గంగానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన నిందితుడు హస్‌రాం మీనా(17) కూలీ పనిచేస్తున్నాడు. ఇద్దరికి షేర్ ఛాట్, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యారు. బాలికను మీరట్ నుంచి రాజస్థాన్‌కు తీసుకుని వెళ్లాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుడు, బాలిక ఫోన్ లొకేషన్ తెలంగాణలో ఉన్నట్లు చూపించింది. గంగానగర్ పోలీసులు వెంటనే తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులను సంప్రదించారు. విషయం తెలిపారు, వెంటనే స్పందించిన పోలీసులు మైనర్ల ఆచూకీ తెలుసుకుని గంగానగర్ పోలీసులకు అప్పగించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మైనర్ల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు 30 ఐఎంఈఐ నంబర్లు, 9 రకాల మొబైల్స్ కాల్స్ డాటా, లొకేషన్లు, వివిధ రకాల ఫోన్ నంబర్లను తెలుసుకున్నారు. నిందితుడు గతంలో రాజస్థాన్‌లో బైక్‌ను చోరీ చేయడంతో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News