Sunday, April 28, 2024

సిక్కిం నుంచి బెంగాల్‌కు ‘తీస్తా’ వరద .. 14కు పెరిగిన మృతులు

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్‌టక్ : కుంభవృష్టితో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రం సిక్కిం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన అతి భారీ వర్షానికి తీస్తానది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరద పోటెత్తింది. ఈ వరదల్లో మృతుల సంఖ్య 14కు పెరగ్గా, మొత్తం 102 మంది గల్లంతయ్యారు. ఇందులో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు దాదాపు రెండు వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.

గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వరద ప్రభావం పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్ ను తాకింది. తీస్తానది ఉద్ధృతికి దిగువనున్న ప్రాంతాలకు భారీగా వరద చేరింది. సరిహద్దుల్లో బెంగాల్ వైపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. బెంగాల్ లోని కాళింపాంగ్ జిల్లాలో గల తీస్తా బజార్‌లో ఇళ్ల లోకి వరద చేరింది. తీర ప్రాంతాల్లోని ఇళ్లు కొట్టుకు పోయాయి. కొన్ని ఇళ్లల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. వరదల ధాటికి సిక్కిం వ్యాప్తంగా 11 వంతెనలు కొట్టుకు పోయాయి. పశ్చిమబెంగాల్ , సిక్కింను కలిపే 10 వ నంబరు జాతీయ రహదారి దెబ్బతింది. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో 3000 మంది పర్యాటకులు చిక్కుకు పోయారు. వంతెనలు , రహదారులు కొట్టుకు పోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News