Monday, April 29, 2024

దశాబ్ది సంపద వనాల లక్ష్యాలను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల రెండవ వారంలో హారితహారం ద్వారా చేపట్టాల్సిన ప్లాంటేషన్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్‌లో అధికారులకు సూచించిన సిఎస్ శాంతికుమారి

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణాకు హరితహారం క్రింద నిర్థారించిన లక్ష్యాన్ని, దశాబ్ది సంపద వనాల క్రింద నిర్దారిత లక్ష్యాలను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. హరిత హారం కింద చేపట్టాల్సిన ప్లాంటేషన్ ను సెప్టెంబర్ రెండవ వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు, తెలంగాణాకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, గొర్రెల పంపిణీ, బీసీ, మైనారిటీలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూ పట్టాల పంపిణీ, సామాజిక భద్రతా పింఛనులు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఉత్సవాలలో భాగంగా ఇటీవల చేపట్టిన కోటి మొక్కల నాటే కార్యక్రమంలో లక్ష్యానికి మించి మొక్కలను నాటడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. నోటరీ స్థలాల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు జీ.ఓ. 84 ను విడుదల చేయడం జరిగిందని, ఈ పథకానికి దారఖాస్తుల స్వీకరణ కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి,వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన విచారించి క్రమబద్దీకరణ చేయాలనీ ఆదేశించారు. జీ.ఓ 59 క్రింద ఇప్పటికీ నోటీసులు అందుకున్నవారి నుండి రెగ్యులరైజేషన్‌కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, పీసీసీఎఫ్ డోబ్రియల్, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ , రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ , రవాణా శాఖ కమీషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ , మున్సిపల్ శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ హనుమంత రావు, ఆర్ధిక శాఖ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Collectors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News