Sunday, April 28, 2024

బిహార్ మాజీ సిఎం రబ్రీదేవి, ఆమె కుమార్తెలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్‌లతో పాటు మరికొందరికి ఢిల్లీ హైకోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న ‘ఉద్యోగాలకు రైల్వేభూమి’ వ్యవహారంపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణన లోకి తీసుకుని కోర్టు ఈ సమన్లు జారీ చేయడమైంది. నిందితులు ఫిబ్రవరి 9 న కోర్టుకు హాజరు కావాలని స్పెషల్ జడ్జి విశాల్ ఆదేశించారు. ఈ కేసు విచారణ చేపట్టడానికి తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదికాక ఈ కేసులో ఇప్పటికే కస్టడీలో ఉన్న వాణిజ్యవేత్త అమిత్ కట్యాల్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ప్రొడక్షన్ వారంట్ జారీ చేశారు.

రైల్వే ఉద్యోగి అయిన 49 ఏళ్ల కట్యాల్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. లబ్ధిదారునిగా ఆరోపణలున్న హృదయానంద చౌదరి, ఎకె ఇన్ఫోసిస్టమ్స్, ఎబి ఎక్స్‌పోర్ట్ అనే రెండు సంస్థల డైరెక్టర్ షరీకుల్ బరి పేరు కూడా ఛార్జిషీట్‌లో ఉంది. ఈ కేసులో కట్యాల్‌ను ఈడీ గత ఏడాది నవంబర్‌లో అరెస్ట్ చేసింది. మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా సమన్లు ఉన్నాయి. అయితే ఇంకా జారీ కాలేదు. ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వియాదవ్ ఈడీ ముందు ఒకసారి హాజరయ్యారు. మళ్లీ ఇంకోసారి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్లను ఈడీ దాఖలు చేయనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News