Sunday, April 28, 2024

ఎన్నికల లబ్ధి కోసమే హెచ్ 1బిపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల లబ్ధి కోసమే హెచ్ 1బిపై ఆంక్షలు
ట్రంప్ సర్కార్‌పై డెమోక్రాట్ల మండిపాటు
అమెరికన్ల ప్రయోజనాల కోసమేనన్న రిపబ్లికన్ పార్టీ

Democratic party slams Trump's Govt over H1B Restrictions

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు ట్రంప్ ప్రభుత్వం హెచ్1 బి వీసాలలో తీవ్ర మార్పులు చేయడం పట్ల ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పార్టీ నాయకుడు, ప్రతినిధుల సభలో జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ జెరాల్డ్ నాడ్లర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ మార్పులు అమెరికన్లకు మేలు చేసేవే అయినప్పటికీ పరిపాలనా నిబంధనల చట్ట ప్రకారం అవసరమైన మామూలు నోటీసుకు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా మార్పులు తీసుకు రావడం ఎంతమాత్రం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘ఇది ఏ విధంగాను సరయిన చర్య కాదు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు. చివరి క్షణంలో రాజకీయ లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నమని స్పష్టంగా అర్థమవుతోంది’ అని ఆయన అన్నారు. అయితే ఈ ఆరోపణలను అధికార రిపబ్లికన్ పార్టీ కొట్టిపారేసింది. అమెరికా వర్క్ వీసా విధానాన్ని ట్రంప్ మరింత మెరుగుపరుస్తున్నారని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ ఈ విధానం దుర్వినియోగం అయిందని, తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు ఉపాధి అవకాశాలను కోల్పోకుండా ట్రంప్ చూస్తున్నారని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ చక్ గ్రాస్లే ప్రశంసించారు. ఇప్పుడున్న విధానం వల్ల అమెరికన్ నిపుణులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తాను చాలాకాలంగా చెప్తూనే ఉన్నానని ఆయన అన్నారు.

కాగా, కొవిడ్19 కారణంగా ఇప్పటికే కుదేలయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిపోకుండా చూడడానికి , ముఖ్యంగా అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా చూసే లక్షంలో యుఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ పని చేస్తోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సర్వీసెస్ (డిహెచ్‌ఎస్) వివరించింది. మరో వైపు ట్రంప్ చర్యను అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఎఐఎల్‌ఎ) తప్పుబట్టింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ కార్మికులు ప్రధానపాత్ర పోషిస్తున్నారని, అయితే ఈ కఠిన నిబంధనలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో తీవ్రమైన అడ్డంకులు కల్పిస్తున్నాయని ఎఐఎల్‌ఎ అధ్యక్షురాలు జెన్నిఫర్ మినియేర్ అన్నారు. ఈనిబంధనలు అమెరికన్లకు మేలు చేయడం మాట అటుంచి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చేసిస్తాయని అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బెంజమిన్ జాన్సన్ దుయ్యబట్టారు.

Democratic party slams Trump’s Govt over H1B Restrictions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News