Thursday, May 2, 2024

రూ.1500 ఎక్కడికి పోవు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

telangana

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపాడు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1500 నగదు జమ చేశామని, జమ అయిన నగదు తీసుకోకపోతే ఖాతా నుంచి పోతాయని ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఒక్కసారి ఖాతాల్లో జమ అయితే నగదు ఎక్కడికి పోదన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. బ్యాంకుల దగ్గర గూమిగూడొద్దని, ప్రభుత్వ నియమాలు పాటించాలన్నారు. తెలంగాణ కరోనా బాధితుల సంఖ్య 644కు చేరుకోగా 18 మంది చనిపోయారు. భారత్ దేశం కరోనా వైరస్ 11,637 మందికి సోకగా 399 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 20 లక్షలకు చేరుకోగా 1,27,594 మంది మరణించారు.

 

Deposite amount not went to other side in Telangana

 

Deposite amount not went to other side in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News