Tuesday, May 7, 2024

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ సకల్పం

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్షమని గిరిజన, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఖాదర్‌పేట నుంచి గొల్లపల్లి మీదుగా కోరంకుంట వరకు రూ.1.80 కోట్లతో నిర్మిస్తున్న సిసి రోడ్ల పనులను కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతీ తండాను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రతీ తండాకు ప్రతీ గ్రామానికి రోడ్ల సౌకర్యం ఉండాలనే లక్షంతో ప్రతీ గ్రామంలో తారు రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.

గతంలో పాలించిన పాలకులు తండావాసులను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకునే వారని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతీ గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి పథకాల్లో ఎలాంటి రాజకీయ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందడం జరుగుతుందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.

ఎమ్మార్సీలో ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలను మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంఈఓ రత్నమాల, మండల విద్యా శాఖ నోడల్ అధికారి మోహన్‌రావు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రజిని, ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు రమణారావు, ఎంపీపీ విజేందర్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, వైస్ ఎంపీపీ, మండల పార్టీ కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, సర్పంచులు కుమారస్వామి, రమేశ్, సమ్మునాయక్, నేజి లాలు, నాయకులు బద్దునాయక్, సాంబయ్య, నర్సింగరావుతోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News