Sunday, April 28, 2024

ప్రగతి వరించిన పట్టణాలు

- Advertisement -
- Advertisement -

 Pattana Pragathi Program

 

జోరుగా, హుషారుగా సాగుతున్న పట్టణప్రగతి కార్యక్రమం
130 పట్టణాల్లో రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
100 స్వచ్ఛవాహనాలు…3.50లక్షల మొక్కలతో పచ్చదనం
200 పబ్లిక్ టాయిలెట్లు… ప్రతి వార్డుకు ట్రాక్టర్, జెసిబి
శిథిలావస్థలోని ఇళ్ల కూల్చివేత

మన తెలంగాణ /హైదరాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణంలో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ముఖ్య ంగా పాలకులు పట్టణాల్లోని వాడవాడలా తిరుగుతున్నారు. వార్డు సభ్యులు, చైర్మన్‌లు స్థానికులను సంప్రదిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతి వార్డుకు ఒక ట్రాక్టర్‌ను, మూడు వార్డులకు ఒక జెసిబి వాహనాన్ని కేటాయించి పనులను చేపడుతూ స్థానిక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఫలితంగా స్థానికంగా ఉండే సమస్యలు ఓ కొలిక్కి వ స్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో పరిశుభ్రత, పా రిశుధ్యం, మొక్కలు నాటడం, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చడం వంటివి చకచకా జరుగుతున్నాయి. వీటితో పాటు అభివృద్ధి పనులకు శం కుస్థాపనలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24న ప్రారంభమైన పట్టణ ప్రగతి ఈ నెల 4వ తేదీ వ రకు సాగనున్నది. రాష్ట్రంలోని 130 పట్టణాల్లో సుమారు రూ. 300 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

సుమారు 10 శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేశారు. సుమారు 3.50 లక్షల మొక్కలు నాటినట్టు అధికార వర్గాల సమాచారం. జనగాంలో 100 పబ్లిక్ టాయిలెట్లు, కల్వకుర్తిలో 75 టాయిలెట్లను నిర్మించాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. దేవరకొండలో రూ. 48 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరును మరింత సరళతరం చేయడంతో పాటు అతి వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు ప్రతి మున్సిపాలిటీలో ఏప్రిల్ నుంచి టిఎస్ బిపాస్ అనే నూతన సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి వస్తున్నట్టు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. మహబూబ్‌నగర్ పురపాలక సంస్థలో 100 స్వచ్చ వాహనాలను ప్రారంభించడంతో అక్కడి వీధుల పరిశుభ్రత కార్యక్రమం సాగుతోంది.

ఆదాయ మార్గాల వైపు…
మంత్రి కెటిఆర్ సూచన మేరకు వార్డులకు కమిటీలు వేసే వరకు తాత్కాలిక పద్దతిన వార్డు ఇన్‌చార్జీలను నియమించారు. ఆర్థిక సంవత్సం ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో ప్రతి పురపాలక సంఘం ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆస్తిపన్ను, వ్యాపార వాణిజ్య పన్నుల వసూలును మరింత వేగవంతం చేశాయి. మొండి బకాయిలకు పట్టణ స్థానిక సంస్థలు రెడ్ నోటీసులు జారీచేస్తున్నాయి. ప్రతి నిర్మాణం అనుమతి ఉన్నదా లేదా..? అని పరిశీలిస్తున్నాయి. అనుమతిలేని లేఅవుట్లను గుర్తించి వాటి జాబితాను సిద్దం చేయడంపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించారు. 122 పురపాలక సంఘాల పరిధిలో ఇప్పటి వరకు కేవలం 150 అక్రమ లేఅవుట్లను. 50 భవనాలు గుర్తించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. యాదాద్రి, జనగాం, శంకర్‌పల్లి, భువనగిరి, ఫీర్జాదీగూడ, జవహార్‌నగర్, ఘట్‌కేసర్, షాద్‌నగర్, తాండూర్, ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు మధ్యలోని విద్యుత్ పోల్స్‌ను వెనువెంటనే తొలగించి నూతన పోల్ ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త చట్టంపై చర్చ, రూ. 148 కోట్లు
పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా మంత్రి కెటిఆర్ రూ. 148 కోట్లు పురపాలక సంఘాలకు విడుదల చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌కు రూ. 78 కోట్లు, వరంగల్ అర్బన్‌కు రూ. 7.34 కోట్లు, ఖమ్మంకు రూ. 3.62 కోట్లు, నల్లగొండకు రూ. 3.41కోట్లు, మంచిర్యాల్‌కు రూ.3.18 కోట్లు, సిద్దిపేట్‌కు రూ. 2.07 కోట్లు ఇ లా మొత్తం 141 స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంతే మొత్తం నిధులు రానున్నాయి. వీటికి పట్టణ పురపాలక సంస్థల స్వంత నిధులతోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

Development works in town by Pattana Pragathi Program
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News