Sunday, April 28, 2024

గ్రామాల్లో గుంపుల నిషేధం

- Advertisement -
- Advertisement -

 

కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం
మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం
అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం
గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై డిజిపి మహేందర్‌రెడ్డి గురువారం అన్ని జిల్లాల ఎస్‌పిలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లా, మండల, గ్రామీణ ప్రాంతాలలో జనం గుంపులు గుంపులుగా ఉండకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు, వేడుకలకు అనుమతివ్వొద్దని డిజిపి నిర్ణయం తీసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా సారించాలని, కరోనా అనుమానితులున్న ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. కరోనాపై అసత్య ప్రచారాలు చేయకుండా తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు గుమిగూడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, ఆంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని జిల్లా ఎస్‌పిలకు డిజిపి సూచించారు. ముఖ్యంగా మండల, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రార్థనా మందిరాల పూజలకు , సమావేశాలు, వివాహాలు అనుమతిలేకుండా నిర్వహించరాదని, అనుమతి లేకుండా నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వర్క్ ఫ్రం హోం
పోలీసు కేంద్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బంది రోజు మార్చి రోజు విధులకు హాజరుకావాలని డిజిపి ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా కార్యాలయంలోని సిబ్బంది వారికి వారే విభజించుకుని రోజు మార్చి రోజు విధులు నిర్వహించాలన్నారు. ఈక్రమంలో ఇంటి వద్ద ఉన్న ఉద్యోగులు తమ ఫోన్లను స్బిచ్ఛాఫ్ చేయకుండా అందుబాటులో ఉండాలని, ముఖ్యమైన పనుల సమయంలో స్పందించి విధుల్లో ఉన్న ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అప్రమత్తం…అవగాహన
కరోనా వైరస్‌పై గ్రామీణ ప్రాంతాలలో స్థానిక పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిజిపి సూచించారు. ముఖ్యంగా కరోనా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేయాలని డిజిపి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలిచ్చారు. ప్రజల శాంతిభద్రతలతో పాటు వారిని పరిరక్షించే బాధ్యత సైతం పోలీసులకు ఉందని తెలిపారు. పోలీసు శాఖలోని కళాజాత బృందాలు కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్యవంతం చేసేందుకు మరింత శ్రమించాలని, కరోనా వైరస్‌పట్ల జనాలలో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలని తెలిపారు. విదేశాల నుంచి నేరుగా వారి స్వస్థలాలకు చేరుకునే వారిపై ప్రత్యేక దృష్టిసారించాలని, ముఖ్యంగా ఉపాధి కోసం అరబ్ దేశాలకు వలసబాట పట్టిన వారి వివరాలను సేకరించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు సమర్పించాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వారు ఉపాధి కోసం పలు దేశాలలో విధులు నిర్వహిస్తున్నారని, వారు సెలువులు, అనారోగ్యం కారణంగా తిరిగి వారి స్వస్థలాలకు చేరుకుంటే వారి సమాచారం సేకరించాలని డిజిపి తెలిపారు.

DGP Mahender reddy review with District SPs on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News