Saturday, May 4, 2024

‘ఉప్పెన’ సెకండ్ సాంగ్ వీడియో.. అదరగొట్టిన రాక్ స్టార్

- Advertisement -
- Advertisement -

 

మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ మూవీతో తెలుగుతెరకు పరిచయం అవుతున్నాడు వైష్ణవ్. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ టీం, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సాంగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘ధక్ ధక్ ధక్..’ అంటూ సాంగే ఈ పాట వీడియో ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన మొదటి పాటకు కూడా వీశేషమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ మూవీకి దేవీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్న కోలీవుడ్‌ స్టార్ విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

Dhak Dhak Dhak full video song from Uppena

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News