Tuesday, April 30, 2024

కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: మెదక్ జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని నర్సాపూర్ సర్కిల్ పరిధిలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌ని ఆకస్మీక తనిఖీ నిర్వహించారు. ఇం దులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులగురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగాపోలీస్ స్టేషన్‌లో కేసులకు సంబందించిన ఫైళ్లను, పోలీస్ స్టేషన్‌కు సంబందించిన రికార్డులను పరిశీలించారు. తదుపరి సిబ్బందితో మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూవారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకుమంచి సేవలుఅందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల మధ్యే ఉంటూ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసుల పాత్రే కీలకంగా ఉంటుందని తెలిపారు.

కాబట్టి సిబ్బంది పోలీసు స్టేషన్‌లోని ప్రతి గ్రామం గురించి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ అవడానికి కమ్యూనిటీ పోలిసింగ్, ప్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని అమలు పరచాలని, అదేవిదంగా ప్రజలకుఎప్పుడు అందుబాటులో ఉంటూప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పెట్టి కేసులు,ఈ చాలన్స్ కేసులలో,ఫెసియేల్, ఫింగర్ ప్రింట్‌లలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం కావునవీటిపైఅవగాహన పెంచుకోవాలన్నారు. సిసి కెమెరాల టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు చేయడానికి సిసి కెమెరాలు ఉపకరిస్తాయని, సిసి కెమెరాల ఏర్పాటు వల్ల ఆ ప్రదేశంలో నేరాలు ప్రభావితంగా నిరోదించగలమని అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటులో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములుగా చేయాలని సిబ్బందికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News