Thursday, May 2, 2024

విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

వర్గల్: వర్గల్‌లోని నవోదయ విద్యాలయం, ములుగులోని టిఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాలలో విద్యార్థులకు శుక్రవారం నుంచి కండ్లకలత సోకి ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దృష్టికి రాగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్. కాశీనాథ్ నేతృత్వంలో వైద్య బృందాన్ని పంపి ఆ రెండు విద్యాలయాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి నేత్ర వైద్య నిపుణులచే విద్యార్థులందరికీ వైద్య పరీక్ష నిర్వహించి ఐ డ్రాప్స్, టాబ్లెట్స్ తదితర అవసరమైన వై ద్య సేవలు అందజేశారు. అలాగే విద్యార్థులకు కంటి శుభ్రత పై అవగాహన క ల్పించారు. అలాగే వర్గల్ నవోదయ విద్యాలయంలో 82 మంది విద్యార్థినీ, విద్యార్థులను, ములుగు టిఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయంలో 60 మంది విద్యార్థినులను మిగతా విద్యార్థుల నుండి వేరు చేసి ప్రత్యేక గదిలో గదులలో ఉంచి అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారు.

వీరికి 24 గ ంటలు వైద్య సేవలు అందించేందుకు ఆ రెండు విద్యాసంస్థలకు ఒక్కొక్క స్టాఫ్ నర్స్‌ను ఆయా విద్యా సంస్థలలో అవసరమైన మందులతో అందుబాటులో ఉం చారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్. కాశీనాథ్ తెలిపా రు. ఈ వైద్య బృందంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. కాశీనాథ్‌తోపాటు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. శ్రీనివాస్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్. రాకేష్, వర్గల్ పిహెచ్సి వైద్యులు డాక్టర్. హరిత, వైద్య సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News