Monday, May 6, 2024

సీనియార్టీ ఆధారంగా డిఎంహెచ్‌ఒ పోస్టులను భర్తీ చేయాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: సివిల్ సర్జన్ ప్రమోషన్స్ ఇస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన డిఎంహెచ్‌వో పోస్టులను సీనియార్టీ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్‌రావును కో రారు. ఈ మేరకు ఆ దివారం డాక్టర్ కత్తి జనార్దన్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య సంఘాల ప్రతినిధుల బృందం మంత్రి హరీష్‌రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల మొ క్కను అందజేశారు. ఈ సందర్బంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా 38 డిఎం అండ్ హెచ్‌వో పోస్టుల ఏర్పాటు, 40 నూతన మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ)ల ఏర్పాటు, యుపీహెచ్‌సీలలో పోస్టులు భర్తీ చేసినందుకు మంత్రి హరీష్‌రావుకు కృతజతలు తెలిపారు. ఆరోగ్య తెల ంగాణను నిర్మించడంలో అహర్నిషలూ కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య పథంలో ముందుకు నడిపిస్తున్న మంత్రి హరీష్‌రావు సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా వైద్య సంఘాల ప్రతినిధులు మంత్రి హరీష్‌రావుకు డాక్టర్ కత్తి జనార్దన్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న సమస్యలపై వి నతి పత్రం అందజేశారు. దీంతో మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ కత్తి జనార్దన్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ కెరియర్ అడ్వాన్స్‌న్మెంట్ కోసం టైమ్ బాండ్ ప్రమోషన్‌లు కల్పించాలని, వైద్యులకు మొబిటిలీ సపోర్ట్ ఇవ్వాలని, అధికారిక సమా వేశాల్లో వైద్యులకు ప్రోటోకాల్ అమలు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. గ్రామీణ దవాఖానల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్ట ర్లకు రూ.50వేల వేతనం మంజూరు చేయాలని, కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న రెగ్యులర్ కాని వైద్య సిబ్బంది రిక్రూట్‌మెంట్లలో డాక్టర్ల నియామకాల తరహాలో ప్రాధా న్యత ఇవ్వడంతో పాటు 2వ ఏఎన్‌ఎంలకు పెండింగ్‌లో ఉన్న 7 నెలల ఏరియర్స్ బకాయిలను వెంటనే వెంటనే విడుదల చేయాలని కోరినట్లు వెల్లడిం చారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిన పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగిలా ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కాం ట్రాక్ట్, ఔట్ సో ర్సింగ్ సిబ్బంది మరణిస్తే, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News