Sunday, April 28, 2024

విద్యుత్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దు

- Advertisement -
- Advertisement -

Transco CMD Prabhakar Rao

 

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించడానికి పోలీసులు సహకరించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకరరావు డిజిపి మహేందర్‌రెడ్డిని కోరారు. విద్యుత్ ప్లాంట్‌లు, సబ్‌స్టేషన్‌లు, లైన్లలో విద్యుత్‌సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తార న్నారు. అయితే తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో వారి విధులకు ఆటంకం కలగకుండా పోలీసులు సహకరించాలని ఆయన కోరారు. వారు విధులకు వచ్చి వెళ్లడానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిజిపికి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి డిజిపి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఏ స్థాయి వారైనా సరే, ఏ సమయంలో అయినా సరే తమ గుర్తింపు కార్డులు చూపిస్తే విధులకు హాజరయ్యే విషయంలో సహకరించాలని పోలీసు అధికారులను డిజిపి ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరైతేనే కరెంట్ ఉంటుందని, లేదంటే రాష్ట్రం అంధకారం అవుతుందని ఈ విషయాన్ని పోలీసులు గుర్తించాలని డిజిపి పోలీసులకు సూచించారు. వైద్య, విద్యుత్, శానిటరీ, మంచినీటి సరఫరా, సివరేజీ, మీడియా తదితర వ్యవస్థలను అత్యవసరమైనవిగా గుర్తించాలని డిజిపి పేర్కొన్నారు. అత్యవసర సర్వీసులో ఉన్నవారు తమ గుర్తింపు కార్డులు చూపిస్తే పోలీసులు సహకరిస్తారని ఆయన తెలిపారు.

Do not interfere with duties of Electricity Employees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News