Thursday, May 2, 2024

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించవద్దు!

- Advertisement -
- Advertisement -

Do Not violate the Rules of Covid-19

రాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తాజాగా ఎన్నికల మార్గదర్శకాలను విడుదల

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా కోవిడ్ నిబందలను దృ-ష్టిలో పెట్టుకుని పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు మంగళవారం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్ కేంద్రానికి వట్టే వారు విధిగా శానిటైజ్ చేసుకోవడంతో పాటు ఫేస్ మాస్క్ ధరించాలని సూచించింది. అలాగే భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు- నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే అనుమతిన వాహనాల సంఖ్య రెండుకు పరిమితం చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది.

భద్రతా సిబ్బంది మినహా ఐదుగురి సభ్యుల బృందానికి మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతి ఉంటుందని తెలిపింది. – ప్రచార కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలని సూచించింది. – పార్టీల అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అర్థగంట విరామం తప్పనిసరిగా ఉండాలని తెలియజేసింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా జిహెచ్‌ఎంసి సర్కిల్, వార్డుల వారీగా నోడల్ హెల్త్ అధికారుల నియమించాలని తెలిపింది. ఇక ఎన్నికల సిబ్బందికి పెద్ద హాల్స్‌లో శిక్షణతో పాటుగా వర్చువల్ ట్రైనింగ్‌ను ఉపయోగించుకోవచ్చునని సూచించింది. సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి బదులుగా మరొకరిని వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు, కమిషనర్, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చునని తెలియజేసింది. – ఒక కౌంటింగ్ హాల్‌లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉండకూడదని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News