Tuesday, April 30, 2024

కరోనా పేరుతో అధిక రాయితీలు వద్దు : బాంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Do not want more concessions in name of Covid: Bombay High Court

ముంబై : కరోనా సాకుతో వ్యాపార సంస్థలు అధిక రాయితీలు పొందడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు, ముంబైకు చెందిన హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా సందర్భంగా వ్యాపార సంస్థలపై దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వర్కింగ్ అవర్స్ తగ్గించారు. ఈ ప్రభావంతో చాలా సంస్థల వ్యాపారం దెబ్బతింది. ఈ నేపథ్యంలో బార్స్, రెస్టారెంట్స్, హోటల్స్ కూడా తీవ్రంగా నష్టపోయాయి. సాధారణంగా వీటిలో మద్యం అమ్మేందుకు ఉదయం పదకొండున్నర నుంచి అర్థరాత్రి ఒకటిన్నర వరకు అనుమతి ఉంటుంది.

అయితే కరోనా సందర్భంగా ఈ టైమ్ ప్రభుత్వం తగ్గించింది. దీంతో తాము నష్టపోయామని, అందువల్ల లైసెన్స్ ఫీజులో యాభై శాతం రాయితీ కావాలని కోరుతూ హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు … వ్యాపార సంస్థలు కరోనా పేరుతో మితిమీరిన రాయితీలు పొందరాదని చెప్పింది. కరోనాసందర్భంగా అందరూ నష్టపోయారని ఈ విషయంలో ప్రభుత్వం తప్పు లేదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ కొట్టి వేసిన కోర్టు, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ. 9 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News