Home జాతీయ వార్తలు కరోనాపై వైద్యుల విజయం: మోడీ

కరోనాపై వైద్యుల విజయం: మోడీ

Doctors won Corona virus says modi

 

బెంగళూరు: కరోనా వైరస్‌పై మన వైద్యులు విజయం సాధించారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కర్నాటకలోని రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచామని, టిబిని 2025లోగా తరిమికొట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 40 వేల వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభించామన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో 22 ఎయిమ్స్ ఆస్పత్రులను నిర్మించామని, 30 వేల ఎంబిబిఎస్ సీట్లను పెంచామని, 15 వేల పిజి సీట్లను పెంచామన్నారు. ప్రపంచంలోనే  హెల్త్‌కేర్ స్కీమ్‌ల్లో ఆయుష్మాన్ భారత్ అతి పెద్దదని మోడీ ప్రశంసించారు. ఆయుష్మాన్ భారత్‌తో కోటి మంది ప్రజలకు లబ్ధి చేకూరునుందన్నారు.