Saturday, May 4, 2024

రియల్ హీరోలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: ప్రమాదం ఎప్పడు ఎలా వస్తుందో ఎవ రూ ఊహించరు. ప్రమాదం నుంచి బయటపడి చచ్చిబతకడం అంటే పునర్జన్మ ఎత్తినట్టు అవుతుంది. అలాంటి విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడిన రియల్ హీరోలు, వీర నారుల సాహసాలు ఎప్పుడు గుర్తుంటాయి. మరోవైపు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఒక కుటుంబానికి ప్రాణం పోసింది. వరద ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించి నీ టిలో చిక్కుకోకుండా చేసింది.

మోరంచ వాగు ఎలాంటి చిరు సునామీ విధ్వంసం సృష్టించిదో అందరికీ తెలిసిందే. ఇంకా ఆ భయానక ఘటన నుండి కోలుకోవడం లేదు. మోరంచపల్లి గ్రామస్థులు. బంధువుల రాకతో తలుచుకుంటూ వారు పడిన బాధను పంచుకుంటున్నారు. నేపథ్యం లో కొంతమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పక్కవారి జీవితాలకు జీవం పోశారు. అదే వారు లేకపోతే ఎంతోమంది గల్లంతు అ య్యే వారు. ఎన్నో ప్రాణాలు పోయేవి. వారి సా హసమే నేడు బాధితులకు ఊపిరి పోసింది.

ఇద్దరిని కాపాడిన కుక్క హెచ్చరిక
గ్రామానికి చెందిన పబ్బ లక్ష్మి, శంకరయ్య వారి కోడలు పబ్బ సరిత, మనవరాలితో కలిసి బుధవారం తమ ఇంట్లో పడుకున్నారు. సరిత భర్త డ్యూటీకి వెళ్లాడు. వీరి ఇల్లు వాగుకు పక్కనే ఉండ డంతో వరద మొదట వీరి ఇంటినే తాకింది. వెం టనే వరదను చూసి వీరు పెంచుకుంటున్న కుక్క డోర్ వద్దకు వచ్చి మొరగడం ప్రారంభించింది. దీంతో కుక్క ఎందుకు అరుస్తుందోనని లేచి చూడ గా అకస్మాత్తుగా పెరుగుతున్న వరదను చూసి వారంతా షాక్ అయ్యారు. దీంతో అప్రమత్తమైన సరిత వరదలో మునిగిపోతున్న అత్తమామలను ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడి తొలుత ఇంటి సజ్జపైకి ఎక్కించింది. అనంతరం అక్కడికీ నీరు చేరడంతో ఇంటిపైకి ఎక్కి రేకులను పగులకొట్టి అత్తమామలతో సహా ఆమె కూతురిని పైకి లాగి వారి ప్రాణాలను రక్షించింది.
తల్లీ కొడుకులను కాపాడిన యువకుడు
మోరంచపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు ఇద్దరి తల్లి, కోడుకల ప్రాణాలను కాపాడాడు. గు రువారం తెల్లవారుజామున వరద ఉధృతితో అప్పటికే గొర్రె ఒదిరెడ్డి, వజ్రమ్మ కళ్ల ఎదుటే కొట్టుకొని పోయారు. కొన్ని నిమిషాల్లో తర్వాత తల్లికొడుకులు జాకాంటి ఆగమ్మ, మల్లిరెడ్డి ఇద్దరు వరదలో కొట్టుకుపోతున్న క్రమంలో ఇంటి గోడ నుంచి దూకి చీరను ఇచ్చి ఇద్దరిని ఇంటి మీదికి లాగాడు. అంతకు ముందు నాగరాజు అనే యువకుడు కొట్టుకునిపోతున్న సమయంలో అతనికి చేతిని అందించి పైకి లాగాడు. దీంతో అందరూ ఊపిరి తీసుకున్నారు.
వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించిన ఎస్.ఐ శ్రీకాంత్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ ఎస్.ఐ శ్రీకాంత్ వరద నీటిలో చిక్కుకున్న బాధితులను అనేక మందిని తన టీంతో రక్షించాడు. దీనిపై తెలంగాణ డిజిపి మహేంద్‌రెడ్డి ట్విట్ చేస్తూ ఎస్.ఐ శ్రీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. గురువారం అర్థరాత్రి నుంచి మోరంచపల్లి జల దిగ్బంధం కావడంతో అటు భూపాలపల్లి, ఇటు గణపురం పోలీసులు రాలేకపోయారు. దీంతో తన టీంతో ఎస్.ఐ శ్రీకాంత్ వరదలో చిక్కుకున్న వారిని తెల్లవారు జాము నుంచే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్.ఐ శ్రీకాంత్‌కి బాధితులు తమ ప్రాణాలను కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
30 మందికి ప్రాణం పోసిన 8 మంది యువకులు
వరద నీటిలో చిక్కుకున్న సుమారు 30 మందికి ప్రాణం పోశారు 8 మంది యువకులు. నరెడ్ల రణధీర్‌రెడ్డి అతని మిత్ర బృందం వరద నీటిలో కొట్టుకపోతున్న బర్రెల కాపరినీ ప్రాణాలను తెగించి కాపాడారు. అలాగే నీటితో ఇల్లు మొత్తం నిండటంతో బయటరాకుండా పోయిన ఓ కుటంబాన్ని తలుపులు పగలకొట్టి మరి వారిని బయటితీసుకొని వచ్చి ఒడ్డుకు చేర్చారు. వీరితో పాటు వరద ధాటికి చెట్ల మీదికి ఎక్కి చాలా సేపు ఉండి చివరికి నీళ్లలో పడిపోయిన వ్యక్తిని లారీ క్యాబీన్‌కి తాడు కట్టి మరీ రక్షించారు. ముగ్గరు లారీ డ్రైవర్లను కూడా బయటకు తీసుకొని వచ్చారు. వీరు చేసిన సాహనాన్ని ప్రతి ఒక్కరు సలాం కొడుతున్నారు.
చేతిలో నాలుగు నెలల పాప..వృద్ధురాలిని పైకి లాగిన వ్యక్తి
వరద ప్రవాహంలో ఓ యువకుడు తన చేతిలో నాలుగు నెలల పాపను పట్టుకుని వృద్ధ్దురాలిని పైకి లాగి ప్రాణాలు కాపాడాడు. మోరంచపల్లి గ్రామానికి చెందిన చారి, మల్లక్క అనే వృద్ధ్దురాలు ఇంట్లో కిరాయి ఉంటున్నాడు. గురువారం వచ్చిన వరదకు అతను తన భార్య పిల్లలతో ఇంటి పైకి ఎక్కాడు. ఈ క్రమంలో వృద్ధ్దురాలు నీటిలో మునిగిపోతుంటే తిరిగి ఆమెను పైకి లాగి ప్రాణాలను బతికించాడు. దీంతో ఆ వృద్ధురాలు, అతని కుమారులు చారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.
గ్రామస్థులను రక్షించడంలో ముందకచ్చిన కర్కపల్లి, లకా్ష్మ రెడ్డి వాసులు
ఒక గ్రామం ఆపదలో ఉన్నది అన్న విషయం తెలుసుకున్న పక్కనే ఉన్న గ్రామ ప్రజలు ముందకచ్చారు. వరద నీటిని నుండి బయటపడటానికి సహాయం చేశారు. మోరంచపల్లి వరద నీటిలో ఉండగా పక్కనే ఉన్న లకా్ష్మరెడ్డి పల్లి, కర్కపల్లి గ్రామ ప్రజలు తమ వంతుగా తాళ్ల సహాయంతో నీళ్లలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడారు. అనంతరం కర్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి కావాల్సిన నీళ్లు, ఆహారం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News