Monday, September 22, 2025

ట్రంప్ రహస్య లేఖ బట్టబయలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు తన రాజకీయ ప్రత్యర్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ, క్రిమినల్ అభియోగాలు మోపాలంటూ అటార్నీ జనరల్ పామ్ బోండిపై ఒత్తిడి పెంచారు. దర్యాప్తులో చర్య లేకపోవడంపై విమార్శనాత్మక ప్రకటనలను తాను సమీక్షించానని శనివారం ఆమె పేరును ప్రస్తావించారు. న్యాయ శాఖ అధికారాన్ని మరింత దూకుడుగా ఉపయోగించాలని బోండికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఆయన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఎందుకంటే బోండికి ట్రంప్ వ్యక్తిగతంగా సందేశం పెట్టబోయి, బహిరంగంగా పోస్టు పెట్టేశారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. తన సోషల్ మీడియా పోస్టులో దర్యాప్తులో నిష్క్రియాత్మకతగా తాము భావిస్తున్న వాటిని విమర్శిస్తూ 30కి పైగా ప్రకటనలను ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రస్తావించారు. ఆయన ప్రత్యేకంగా మాజీ ఎఫ్‌బిఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ ఆడమ్ షిప్, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టారు. కొంత కాలంగా వీరితో ట్రంప్‌కు వైరం నడుస్తోంది.

ఈ క్రమంలో వారిపై చర్యలను తీసకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ పో స్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. శనివారం సాయంత్రం వర్జీనియాలోని మౌంట్ వెర్నాన్‌లో జరిగిన కార్యక్రమానికి వైట్ హౌస్ నుండి బయలుదేరిన ట్రంప్, చట్టపరమైన ప్రక్రియ పట్ల తనకున్న అసహనాన్ని వివరిస్తూ తన తొలి పోస్ట్ గురించి క్లుప్తంగా వివరించారు. ‘వారు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మేము త్వరగా చర్య తీసుకోవాలనుకుంటున్నాము’ అని ఆయన విలేకరులతో అన్నారు. ‘వారు దోషులు కాకపోతే, అది పర్వాలేదు. వారు దోషులు అయితే, లేదా వారిపై అభియోగాలు మోపవలసి వస్తే, వారిపై అభియోగాలు మోపాలి, మనం ఇప్పుడే దాన్ని చేయాలి’ అని ట్రంప్ అన్నారు.

Also Read: ఏడు యుద్ధాలు ఆపా.. ‘నోబెల్’ నాకే ఇవ్వాలి?: ట్రంప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News