Sunday, April 28, 2024

కనిపించి వెళ్లారు…

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: కరోనా వైరస్ చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కొద్ది సేపు కారులో బయటకు వచ్చారు. ఆయన వెంట లోపల ఇద్దరు ముగ్గురు ఉండగా కారులో విహరిస్తూ కొద్ది సేపు బయట ఉన్న మద్దతుదార్ల వైపు చూస్తూ నవ్వుతూ అభివాదం చేశారు. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ట్రంప్ కోలుకున్నారని, ఆయన సోమవారం ఎప్పుడైనా డిశ్చార్జి అవుతారని ఆదివారం వైద్య బృందం తెలిపింది. దీనితో ట్రంప్ మద్దతు దార్లు అక్కడ పెద్ద ఎత్తున గుమికూడారు. అయితే ట్రంప్ డిశ్చార్జ్ కాలేదు కానీ ఆయన ఓ కారులో తోడుగా ఇద్దరు సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు కూడా ఉండగా వచ్చారు. వాషింగ్టన్ డిసికి చెందిన మేరీలాండ్ శివారు ప్రాంతం బెతెసడాలోని రాక్‌విల్లే పైక్‌లో ట్రంప్ కారు విహారం జరిగింది. ఆసుపత్రికి, జాతీయ వైద్య విజ్ఞాన సంస్థకు మధ్య ఉన్న రాదారిలో ట్రంప్ కారు ప్రయాణం సాగింది. ఓ వైపు పూర్తి స్థాయిలో కోలుకున్నదీ లేనిదీ నిర్థారణ కాకుండానేట్రంప్ బయటకు రావడం, మద్దతుదార్లకు కన్పించేలా కిటికీ బయటకు చూస్తూ వారిని గ్రీట్ చేయడం ఇవన్నీ వీడియోల ద్వారా ప్రచారం పొందాయి. వెనుక సీట్లో నల్లటి మాస్క్ ధరించి ఉన్న ట్రంప్ తనకు కరోనా ముప్పు తప్పిందనే భావన కల్గించేందుకు కాసేపు ఆసుపత్రి నుంచి బయటకువచ్చినట్లు వెల్లడైంది. సీక్రెట్ ఏజెంట్లు ఇద్దరూ మాస్క్‌లు, కళ్లకు రక్షక తొడుగులు ధరించారని, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. కరోనా కట్టుబాట్లను పాటించారని వివరించారు. మిలిటరీ ఆసుపత్రి ఆవరణలో కొంచెం తక్కువ వేగంతో వెళ్లుతున్న ప్రత్యేక కారులో ట్రంప్ ముందుకు సాగారు.
మూర్ఖత్వం, ఇతరులకు ప్రాణసంకటం
చికిత్స దశలో ట్రంప్ ఈ విధంగా బయటకు రావడం వివాదాస్పదం అయింది. కోవిడ్ నిబంధనలను ట్రంప్ ఈవిధంగా పూర్తిగా పాతరేశారని విమర్శలు వెల్లువెత్తాయి. కొద్ది సేపు అయిన ఈ విధంగా బయటకు రావచ్చా? ట్రంప్ కారు లోపల ఉన్నారు. ఆయనకు ఇంకా వైరస్ ఉంది. తక్కువ దూరంలోనే ఇతరులు కూర్చుని ఉన్నారు. కారులో వైరస్ వ్యాప్తికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉందని విమర్శలు వెలువడ్డాయి. దేశాధ్యక్షుడుఅన్ని తెలిసి ఈ విధంగా చేయడం అవివేకపు చర్య అని పలువురు మండిపడ్డారు. కోవిడ్ గురించి ముందు తాను పెద్దగా పట్టించుకోలేదని, అయితే తరువాతి క్రమంలో బాగా నేర్చుకున్నానని చెపుతోన్నట్రంప్ ఇప్పుడు చేసిందేమిటని, ఇదేనా ఆయన నేర్చుకున్న పాఠంఅని ప్రశ్నలు రెకెత్తాయి. ఇది అధ్యక్షుడి అనవసరపు ఆర్బాటపు పర్యటన, రాజకీయ ప్రయోజనాలకు ఈ విధంగా చేశారు. ఆయన వెంట ఉన్నవారంతా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే. వారు జబ్బున పడవచ్చు, మరణించవచ్చు.

ట్రంప్ తన రాజకీయ బల ప్రదర్శనకు ఈ విధంగా ఇతరులను ప్రమాదంలోకి నెడుతారా? అని ట్రంప్ చికిత్స జరుగుతున్న వాల్టర్ రీడ్ ఆసుపత్రి ప్రముఖ డాక్టర్ జేమ్స్ ఫిలిప్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రెసిడెంట్ కారు బుల్లెట్ ప్రూఫ్. పైగా బయటి నుంచి రసాయనిక దాడులు జరగకుండా గాలికూడా లోపలికి వెళ్లనిరీతిలో సీల్ ఉంటుంది. కారులోపల వైరస్‌తో ఉన్న వ్యక్తి వల్ల ఇతరులకు ముప్పు. పైగా గాలి ప్రసరణ లేని దశలో ప్రయాణం చికిత్స పొందుతున్న వ్యక్తికి రిస్క్ . దీనిని గుర్తించినట్లా? గుర్తించినా లైట్ తీసుకుని ఈ విధంగా వ్యవహరించడం తగునా? అని ఫిలిప్ ప్రశ్నించారు. ట్రంప్ గురించి కన్నా, కారులో ఆయనతో పాటు ఉన్న ఇతరుల పరిస్థితిపైనే తన ఆలోచనలు కేంద్రీకృతం అయ్యాయని, ట్రంప్ వారు అన్నింటిని తట్టుకుని నిలబడుతారేమో అయితే విధులలో ఉండే వారికి ఈ స్థయిర్యం ఉండాలనే రూల్ లేదు కదా? పైగా వీరు సీక్రెట్ ఏజెంట్స్. వారి పరిస్థితి గురించి ట్రంప్ ఎందుకు పట్టించుకోలేదు. వారిని కారు ఛాంబర్‌లో వెంట తీసుకుపోయినట్లుగా వ్యవహరించారని ఫిలిప్ విమర్శించారు. ప్రస్తుతం ట్రంప్ చికిత్స జరిగే ప్రఖ్యాత మిలిటరీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఈ డాక్టర్ జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయపు అనుబంధ వైద్య ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ప్రత్యేక విధులలో ఉన్నారు.

Donald Trump comes out to show Strength

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News