Monday, April 29, 2024

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న కాజల్?

- Advertisement -
- Advertisement -

Kajal Aggarwal to marry businessman?

కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతోందని.. ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుందని… ఈ ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడి యా తాజాగా కాజల్ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ మీడియా కథ నం ప్రకారం… కాజల్ అగర్వాల్ ముంబయ్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లుని త్వరలోనే వివాహం చేసుకోనుందని తెలిసింది.

Kajal Aggarwal to marry businessman?

త్వరలో కాజల్, గౌతమ్‌ల పెళ్లి తేది కూడా ఖరారు చేయనున్నారట. ఈ వివాహం ముంబయ్‌లోని చర్చ్ గేట్ ప్రాంతంలో కాజల్ ఇంటికి దగ్గరగా ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌లో రెండు రోజుల వేడుకగా జరుగనుందని.. లాక్‌డౌన్ తర్వాత జరుగబోయే మొదటి సెలబ్రిటీ వివాహం ఇదేనని పేర్కొంది. గౌతమ్ కిచ్లు ఒక ఇంటీరియర్ డిజైనర్. గత కొంత కాలంగా గౌతమ్ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్‌లో ఉన్నాడని సమాచారం. అయితే, దీని గురించి కాజల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలే దు. మరి పెళ్లి వార్తలపై చందమామ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Kajal Aggarwal to marry businessman?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News