Tuesday, May 14, 2024

ఢిల్లీ మళ్లీ టాప్ గేర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మళ్లీ టాప్ గేర్

స్టోయినిస్ మెరుపులు, రాణించిన బౌలర్లు, బెంగళూరుపై శ్రేయస్ సేన గెలుపు

IPL 2020:DC Won by 59 Runs against RCB

దుబాయి: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 59 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (43) తప్ప మిగతావారు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో రబడా నాలుగు, అక్షర్, నోర్జే రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలు శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ధావన్ కాస్త సమన్వయంతో ఆడగా పృథీషా చెలరేగి పోయాడు. చూడచక్కని షాట్లతో అలరించిన షా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ధాటిగా ఆడిన పృథ్వీ 23 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. ధావన్ 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. కాగా, కెప్టెన్ శ్రేయస్ ఈసారి నిరాశ పరిచాడు. 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక చివర్లో రిషబ్ పంత్, స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. దీంతో ఢిల్లీ స్కోరు వేగంగా పరిగెత్తింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన స్టోయినిస్ 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధాటిగా ఆడిన పంత్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 25 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ స్కోరు 196 పరుగులకు చేరింది.

IPL 2020:DC Won by 59 Runs against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News