Sunday, April 28, 2024

అణా పైసా ఖర్చు లేకుండా పేదోళ్లకు ఇండ్లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Double bed room inaugurated in vanastalipuram

హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. గత ఐదేండ్ల క్రితం రైతు బజార్ దగ్గర గుడిసెలతో బస్తీ ఉండేదని ప్రస్తుతం ఎంతో నాణ్యతతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. పేదోడి ఇంట్లోను అన్ని వసతులు ఉండాలనే సంకల్పంతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలియజేశారు. దేశంలోని ఏ నగరంలోనూ ఇంత పెద్ద ఇండ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. బ్యాంకర్లతో సంబంధం లేకుండా అణా పైసా ఖర్చు లేకుండా పేదోళ్లకు కెసిఆర్ ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తుందని కెటిఆర్ ప్రశంసించారు. 28.03 కోట్ల రూపాయలతో జై భవాని నగర్‌లో రైతు బజార్ దగ్గర 324 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. రెండు ఎకరాల స్థలంలో మూడు బ్లాక్‌లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సెల్లార్, స్టిల్ట్, తొమ్మిది అంతస్థులుగా ఒక్కో బ్లాక్‌ను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.8.65 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. విద్యుత్, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, విశాలమైన అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి, ఎంఎల్‌సి మల్లేశం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News