Sunday, April 28, 2024

ఈనెల 15న డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 15వ తేదీన రాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం తెలిపారు. రెండవ విడుత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈనెల 21వ తేదీన గ్రేటర్ వ్యాప్తంగా 13,300 మందికి లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేయాలని నిర్ణ యించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రతి నియోజవకవర్గం నుంచి 500 మంది చోప్పున జిహెచ్‌ఎంసి పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మొత్తం 13300 మందిని ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.ఎంపిక ప్రక్రియ రాజకీయ,కుల,మతాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు,మీడియా సమక్షంలో పూర్తి పారదర్శకంగా కేటాయించేందుకు సాంకేతికతను నియోగించుకుంటున్నమన్నారు. ఎంపికైన లబ్దిదారులకు గ్రేటర్ పరిధిలో నిర్మించిన వివిధ ప్రదేశాల్లో ఇళ్లను కేటాయించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News