Sunday, May 5, 2024

ఆ సమయంలో వాయుసేన అద్భుతంగా పని చేసింది: రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పరేడ్ నిర్వహించారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌కు రివ్యూయింగ్ అధికారికంగా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే తొలిసారి. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను క్యాడెట్లు గుర్తించుకోవాలన్నారు. టర్కీ భూకంప సహాయ చర్యలో భారత వాయు సేన బాగా పని చేసిందని ప్రశంసించారు. కరోనా సమయంలోనూ వాయుసేన అద్భుతంగా పని చేసిందని కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికత అందిపుచ్చుకోవాలని సూచించారు. సుఖోయ్ జెట్‌లో ప్రయాణం గొప్ప అనుభూతి ఇచ్చిందని మెచ్చుకున్నారు. ఫైటర్ జెట్ పైలట్లలో మహిళలూ ఎక్కువ మంది ఉండటం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News