Tuesday, April 30, 2024

మూడు కమిషనరేట్లలో డిడి కేసులు

- Advertisement -
- Advertisement -

Drunk and drive cases against 1814 people in Hyderabad

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు
1,814మందిపై కేసులు నమోదు
ఇద్దరు మహిళలు ఉన్నారు
వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులు
ఫొటోః డిడి పేరుతో ఉంది

హైదరాబాద్: మూడు పోలీస్ కమిషనరేట్లలో డిసెంబర్31వ తేదీ రాత్రి నుంచి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదుచేశారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1,814మందిపై కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేశార. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ముడు పోలీస్ కమిషనర్లు ముందుగానే హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెల్లవారుజామున వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువ మంది పట్టుబడిన వారిలో 931 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పట్టుబడ్డారు. ఇందులో 721 ద్విచక్ర వాహనదారులు, కార్లు 190, 18ఆటోలు, 2 లారీలను పట్టుకున్నారు.

మద్యం తాగావాహనాలు నడుపుతున్న వారిలో మహిళ కూడా ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 496 మందిని పట్టుకున్నారు. మద్యం తాగిన వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 387మంది పట్టుబడ్డారు. వీరిలో ఒక మహిళ ఉంది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు నిఘా పెట్టారు. మూగ్గురు పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, విసి సజ్జనార్, మహేష్‌భగవత్ స్వయంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News