Wednesday, May 1, 2024

రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక యాదవులను తప్పుదోవ పట్టిస్తున్నాడు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడులో ఓటమిని జీర్ణించుకోలేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదవులు, కురుమలను తప్పుదోవ పట్టిస్తున్నాడని గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంఘం చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు విమర్శించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. యాదవ, కురుమలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7.61,896 మంది లబ్దిదారులను గుర్తించి మొదటి విడుతలో 3 లక్షల 93 వేల మంది లబ్దిదారులకు ఐదు వేల కోట్ల రూపాయలతో 84 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు వివరించారు. రెండో విడుతలో 3.63 లక్షల మంది లబ్దిదారులకు పథకాన్ని అందించాలని రూ.4,697 కోట్ల రుణాన్ని ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీగా చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.

పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఉన్న లబ్దిదారులకు డివిటి పద్దతి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్దతిలో పథకాన్ని చేపట్టే ప్రయత్నం జరుగగా బిజెపి కుట్రకు పాల్పడిందని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీకి గొల్ల కురుమలు మద్దతు తెలుపుతున్నారని ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదు చేసి వారి అకౌంట్లలో డబ్బులు రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. యాదవ, కురుమ సోదరులు ప్రభుత్వ సంక్షేమానికి అనుకూలంగా ఉన్నారని వరిలో ఆందోళన కల్గించేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డి ధర్నాకు దిగడాన్ని ఆయన ఖండించారు. రాజగోపాల రెడ్డి ఇచ్చిన హామీలు నేరవేర్చాలని, కేంద్ర సహకారంతో చేపడ్తామన్న పథకాలను అచరణలో చూపాలని డిమాండ్ చేశారు.

Dudimetla Balaraju slams Komatireddy Rajagopal Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News