Sunday, May 5, 2024

తొలి రోజున బాలా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: శరన్నవరాత్రుల్లో భాగంగా తోలిరోజైన ఆశ్వయుజ శుద్ద పాడ్యమి,  ఆదివారం.. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గ బాలత్రిపుర దేవిగా సాక్షాత్కరించనుంది. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ళ లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త దుస్తులు కానుకగా అందిస్తారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలను కట్టి పాయసం ,గారెలను నైవేద్యంగా నివేదిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News