Sunday, April 28, 2024

ఈనెల 14 నుంచి 24 వరకు ఓయూకు దసరా సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణలో దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. విద్యార్థులకు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు యూజీ, పీజీ కాలేజీల విద్యార్థులకు దసరా, బతుకమ్మ సెలవులు వర్తిస్తాయి. 10 రోజుల సెలవుల అనంతరం ఓయూ క్యాంపస్‌తో పాటు ఓయూ అఫిలియేటడ్ కళాశాలలు తిరిగి అక్టోబర్ 25వ తేదీన తెరుస్తామని పేర్కొంది.

మరోవైపు దసరా, బతుకమ్మ పండగలను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 23 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీన కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News