Saturday, April 27, 2024

నల్ల జాతీయులకు తగిన గౌరవం ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Dwayne Bravo comments on Racism

 

అంటిగ్వా: అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపథ్యంలో జాతి వివక్షపై జరుగుతున్న చర్చలో భాగంగా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో స్పందించాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిందని, ఇక నుంచైనా నల్లజాతీయులకు కనీస గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా నల్ల జాతీయులు తీవ్రమైన వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారని వాపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులు అందరిలాగే గౌరవ మర్యాదాలు అందుకోవాలన్నదే తన తపన అన్నాడు. ఎవరూ ప్రతీకారం కోరుకోవడం లేదని, సమానత్వం కావాలని మాత్రమే కోరుతున్నామన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నాడు. ఓ నల్ల జాతీయ వ్యక్తిగా తమ చరిత్ర గురించి బాగా తెలుసని, తాము ఎప్పుడూ ప్రతీకారం కోరులేదని, సమానత్వం, గౌరవం మాత్రమే అడుతున్నామని స్పష్టం చేశాడు. ప్రపంచ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న నల్ల జాతీయులు అడుగడుగున వర్ణ వివక్షను ఎదుర్కొవడం తనను ఎంతో కలచి వేస్తుందన్నాడు. భవిష్యత్తులోనైన తమకు తగిన గౌరవం ఇవ్వాలని కోరాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి ఎంబాగ్వతో ఇన్‌స్టా లైవ్‌షోలో బ్రావో పాల్గొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News