Monday, April 29, 2024

వివక్ష అంతంతోనే సరికొత్త కాంతి

- Advertisement -
- Advertisement -

George Floyd funeral is over

 

అమెరికాలో మిన్నంటిన నినాదాలు
బ్లాక్‌స్టార్ ఫ్లాయిడ్ అంతిమ యాత్ర
సింగర్ల గీతాలాపన
తరలివచ్చిన నటులు నేతలు

హుస్టన్ : పోలీసుల దమనకాండలో మృతి చెందిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు అసంఖ్యాకుల నివాళుల నడుమ ముగిశాయి. వందలాది మంది మాస్క్‌లతో అశ్రునయనాలతో అంతిమ ఘట్టానికి హాజరయ్యారు. అమెరికాలో జాత్యాహంకార ధోరణులు ప్రబలరాదని, అన్ని తెగల పట్ల సమన్యాయం పాటించాలని నినాదాలు పిలుపుల నడుమ భావోద్వేగాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఆఫ్రో అమెరికన్ కస్టడీలో ఉండగా దారుణ రీతిలో పోలీసుల కాలిబూట్ల కింద నలిగి చనిపోవడంతో అమెరికాలోనే కాకుండా పలు దేశాలలో తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమెరికాలోని పలు నగరాలలో నల్లజాతీయులు ప్రదర్శనలు నిర్వహించారు. దీనితో కొన్ని చోట్ల కర్ఫూ పెట్టారు. బ్రిటన్‌లోనూ తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగాయి. గత నెల 25వ తేదీన ఫ్లాయిడ్ అమెరికాలోని మిన్నియాపొలిస్‌లో మృతి చెందారు. 46 ఏళ్ల ఆ వ్యక్తి పోలీసు అధికారి కాలిబూట్ల కింద నలిగిపోతూ ఊపిరితీసుకోలేకపోతున్నానని ఆక్రందించడం , ప్రాణాలు వదలడం చివరికి అమెరికాలో నల్లజాతీయుల ఉపిరి ఉద్యమానికి దారితీసింది.

మంగళవారం ఫ్లాయిడ్ అంత్యక్రియలు ఆఫ్రో అమెరికన్ పద్ధతి ప్రకారం జరిగాయి. నేపథ్యంలో దైవ ప్రార్థనలు జరుగుతూ ఉండగా ,వందలాది మంది న్యాయం కోసం నినదిస్తూ ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫ్లాయిడ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండగా విషాదఛాయల నడుమ అంతిమఘట్టం ముగిసింది.కోవిడ్ వైరస్ తరుణంలోనే ఆయన భౌతిక కాయాన్ని హుస్టన్‌కు తీసుకువచ్చారు. బంగారు పేటికలో ఉంచిన భౌతికకాయాన్ని తెల్లటి గుర్రపు రథం లాగుతూ ఉండగా అంతిమయాత్ర సాగింది. ఆయన తల్లి సమాధి పక్కనే ఆయనను ఖననం చేశారు. దాదాపుగా 500 మందికి పైగా ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. చివరి ఘట్టం సందర్భంగా ఆయన సోదరుడు కన్నీటి పర్యంతం అయ్యారు. తాను ఎంతగానో ప్రేమించే సోదరుడిని పోగొట్టుకున్నానని, ఆయన తన పాలిటి సూపర్‌మెన్ అని తెలిపారు. ఫ్లాయిడ్ సంస్మరణలో ఆరు రోజుల పాటు సంతాపాలు మూడు నగరాలలో సాగుతూ వచ్చాయి.

ఆయన జన్మస్థలం నార్త్ కరోలినాలోని రేఫోర్డ్ , ఆయన పెరిగిన హుస్టన్, చివరికి ఆయన దారుణ రీతిలో అంతం అయిన మిన్నియాపొలిస్‌లో సభలు సంస్మరణ సమావేశాలు జరిగాయి. ఇక్కడ జరిగిన అంతిమక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గ్రామీ అవార్డుల విజేత నె యో కూడా వచ్చారు. వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదనే గీతం ఆలాపించారు. నాలుగు గంటల పాటు అంతిమయాత్ర సాగింది. తరలివచ్చిన వారిలో యాక్టర్లు జెమీ ఫాక్స్, ఛానింగ్ టటూమ్ ఇతరులు ఉన్నారు. హుస్టన్ పోలీసు అధికారి ఆర్ట్ అకెవిడో, హుస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఇతరులు కూడా ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News