Thursday, May 16, 2024

ఆగస్టు 8న పెళ్లి

- Advertisement -
- Advertisement -

Wedding date of Rana and Mihika Bajaj has been finalized

 

దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్‌ల పెళ్లి జరిగే తేదీ ఖరారైంది. ఆగస్టు 8న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. వివాహం జరిగే తేదీలో ఎటువంటి మార్పులు ఉండవని వారు స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుకను నిర్వహించేందుకు రానా, మిహీకాల కుటుంబ సభ్యులు ఏర్పాట్లు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఆగస్టు 6, 7 తేదీలలో పలు వేడుకలను నిర్వహించి 8వ తేదీన రానా, మిహీకాల వివాహాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో స్నేహితులు, సన్నిహితుల మధ్య తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలను నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News