Wednesday, May 1, 2024

‘ఎర్లీబర్డ్’ సూపర్‌హిట్

- Advertisement -
- Advertisement -

అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయవంతం

5 శాతం రాయితీని వినియోగించుకున్న 3,53,782 మంది మొత్తం రూ.222.58 కోట్ల
ఆదాయం గత సంవత్సరం కన్నా ఈసారి 82.18 శాతం అధిక వృద్ధి రేటు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్: పురపాలక శాఖ అమల్లోకి తీసుకొచ్చిన ‘ఎర్లీబర్డ్’ పథకం అన్ని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్‌లలో (జిహెచ్‌ఎంసి మినహా) అదనపు ఆదాయాన్ని సమకూర్చింది. గత సంవత్సరం రికార్డులను అధిగమిస్తూ 2022, 23 ఆర్థిక సంవత్సరానికి పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన ‘ఎర్లీబడ్’ పథకం కింద 5 శాతం రాయితీని 3,53,782 మంది వినియోగించుకోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు కలిపి రూ.222.58 కోట్ల ఆదాయం ఆ శాఖకు సమకూరింది. ప్రస్తు తం పురపాలక శాఖ 5 శాతం రాయితీ ప్రకటించడంతో వినియోగదారులు దానిని సద్వినియోగం చేసుకోవడానికి ఆస్తకి చూపారు. ‘ఎర్లీబ డ్’ పథ కం సద్వినియోగం చేసుకోవాలంటే పాత బకాయిలు లేని, కొత్త ఆర్థిక సంవత్సరం (202223) ఆస్తి పన్ను చెల్లించే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఎర్లీబర్డ్ రాయితీ వినియోగించుకోవాలనుకుంటే ముందు బకాయిలన్నీ చెల్లించాలన్న షరతును వినియోగదారులు అంగీకరించడంతో పాటు అధికంగా పన్నులను చెల్లించడానికి ముందుకు వచ్చారని పురపాలక శాఖ అధికారులు తెలిపారు.

గత సంవత్సరం కంటే ఈసారి అధికం

ఎర్లీబర్డ్ పథకంలో భాగంగా గత సంవత్సరం 2021,22 సంవత్సరంలో రూ.122.32 కోట్ల ఆదాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా పురపాలక శాఖకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం 2022, 23లో గత సంవత్సరం కన్నా రూ.129.67 కోట్ల ఆదాయం రాగా, 82.18 శాతం అధిక వృద్ధిరేటును సాధించిందని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల ద్వారా మొత్తం రూ.222.85 కోట్ల ఆదాయం రాగా 3,53,782 మంది 5 శాతం ఎర్లీబడ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

5 సంవత్సరాల క్రితం ఎర్లీబర్డ్ ఆఫర్ అమల్లోకి….

5 సంవత్సరాల క్రితం ఎర్లీబడ్ ఆఫర్‌ను పురపాలక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టగా 2018, 19 సంవత్సరంలో 84,909 మంది ఈ ఆఫర్‌ను వినియోగించుకోగా రూ.4084.70 లక్షల ఆదాయం ఆ శాఖకు వచ్చింది. 2019, 20 ఆర్థిక సంవత్సరంలో 1,50,061 మంది వినియోగించుకోగా రూ.7380.95 లక్షల ఆదాయం సమకూరింది. 2020, 21 ఆర్థిక సంవత్సరంలో 3,00,523 మంది వినియోగించుకోగా రూ.12,967.61 లక్షల ఆదాయం వచ్చింది. 2021, 22 ఆర్థిక సంవత్సరంలో 2,77,736 మంది వినియోగించుకోగా రూ.12,231.51 లక్షల ఆదాయం, 2022, 23 ఆర్థిక సంవత్సరంలో 3,53,782 మంది వినియోగించుకోగా రూ.22285.59 లక్షల ఆదాయం సమకూరిందని పురపాలక శాఖ తెలిపింది.

చివరిరోజు రాత్రి 10 గంటల వరకు…..

శనివారం రాత్రి 10 గంటల వరకు (చివరిరోజు) ఆస్తిపన్నును చెల్లించడానికి వినియోగదారులు ఆసక్తి చూపారు. ఆస్తిపన్నును ఆన్‌లైన్, మీసేవ కేంద్రాలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల (సిఎస్సీలు)ద్వారా చెల్లించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘ఎర్లీబడ్’ పథకాన్ని ప్రత్యేక అధికారులతో కూడిన మానిటర్ కమిటీ నిరంతరం పర్యవేక్షించింది. దీంతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి పేపర్, టివిల్లో అడ్వర్టయిజ్‌మెంట్‌లు, లోకల్ వాట్సప్ గ్రూపుల్లో ఈ పథకం గురించి ప్రజలకు పురపాలక శాఖ తెలియచేసింది. ఈ పథకం గురించి ఎప్పటికప్పుడు వినియోగదారులను అలర్ట్ చేయడానికి వారి ఫోన్ నెంబర్‌లకు ఎస్‌ఎంఎస్‌లను పంపించడం లాంటి చర్యలను ఆ శాఖ చేపట్టింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు కలిపి సుమారుగా రూ.597 కోట్ల డిమాండ్‌ను అంచనా వేయగా 37.27 శాతం సుమారుగా రూ.222.58 కోట్ల ఆదాయం పురపాలక శాఖకు సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట జిల్లాల ప్రజలు ‘ఎర్లీబడ్’ పథకాన్ని 40 శాతానికి పైగా అక్కడి ప్రజలు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికం

ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసి)కు రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు అయ్యింది. ఏప్రిల్ నెలలో రూ. 742.41 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా అందులో శనివారం ఒక్క రోజే రూ. 100.38 కోట్లు వసూలయ్యిందని అధికారులు తెలిపారు. ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో భాగంగా ఏప్రిల్‌లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబెట్ ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News