Sunday, May 5, 2024

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం చేపట్టదలచిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను అసెంబ్లీ ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో డిసెంబర్ 5 వరకు చేపట్టవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం కేంద్రాన్ని ఆదేశించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో, ఉప ఎన్నిక జరగనున్న నాగాలాండ్‌లోని తాపి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘ జిల్లా రథ ప్రభారీ’లను నియమించవద్దని కేబినె కార్యదర్శి రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో ఎన్నికల కమిషన్ కోరింది.

నవంబర్ 20నుంచి ప్రారంభం కానున్న ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కోసం ప్రత్యేక అధికారులుగా జిల్లా రథ ప్రభారీలుగా సీనియర్ అధికారులను నామినేట్ చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలకు జారీ చేసిన సర్కులర్‌లో కోరినట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని, కమిషన్ పేర్కొంది. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నియోజకవర్గాల్లో డిసెంబర్ 5వ తేదీ దాకా అలాంటి కార్యకలాపాలను చేపట్టరాదని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తోంది’ అని ఆ లేఖలో ఇసి పేర్కొంది. కాగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో యాత్రలు జరపబోమని అంతకు ముందు కేంద్రం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News