Sunday, April 28, 2024

‘లైగర్’లో రాజకీయ నేతల పెట్టుబడులు.. పూరీ, చార్మిలపై ఇడి ప్రశ్నల వర్షం…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మిలు నిర్మించారు. అయితే ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారనే అనుమానంతో ఇడి పూరి జగన్నాథ్, చార్మిలకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్, చార్మిలను గురువారం ఉదయం నుంచి ఇడి ప్రశ్నిస్తోంది.

కాగా, 15 రోజుల క్రితమే పూరీకి ఇడి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులపై పూరీ జగన్నాథ్‌ను ఇడి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, చార్మిలను ఇడి విచారించిన విషయం విదితమే. అయితే ఆ కేసులో పూరి జగన్నాథ్, చార్మిలతో పాటు ఇతరులకు కూడా ఇడి క్లీన్ చిట్‌ను ఇచ్చింది. అయితే.. తాజాగా పరిణామాలలో ఇడి విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.

ED questioning Puri Jagannadh and Charmi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News