Friday, April 26, 2024

మనీశ్ సిసోడియాను మరో పది రోజులు కస్టడీకి ఇవ్వండి: ఈడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను మరో 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కోరింది. ‘కొంత మందికి అక్రమ ప్రయోజనాలను అందించడానికి కుట్రపన్నారు. కొత్త మద్యం పాలసీ కోసం సౌత్ గ్రూప్ కుట్రపన్నిందని, దీని ఫలితంగా హోల్‌సేల్ వ్యాపారులకు అసాధారణ లాభాలు వచ్చాయి’ అని ఈడి వాదించింది.

సిసోడియాను అరెస్టు చేసిన మరునాడు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సిసోడియాను అరెస్టు చేయడానికి ముందు ఈడి అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇదే మద్యం పాలసీలో ఇదివరకు ఫిబ్రవరి 26న కూడా సిబిఐ ఆయనను అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచారు.

ఇదిలావుండగా, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటులో మహిళలకు మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు రిజర్వేషను కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరతూ భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) నాయకురాలు కె.కవిత శుక్రవారం ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. కవిత వెంట తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News