Monday, May 6, 2024

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : అమెరికా పర్యటనలో తానా సభల సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగంపై తనకున్న విషాన్ని కక్కుతూ తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు వద్దని, 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కారేపల్లి క్రాస్ రోడ్ నందు బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్వర్యంలో బుధవారం గంటసేపు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌లు మాట్లాడుతూ 24 గంటలు కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ పరిపాలన కావాలా, లేకుంటే మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా రైతులు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.

గతంలో కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు నాణ్యమైన కరెంటు లేక ఎప్పుడు వస్తుందో తెలియక చేలలో, పొలాలలో అర్ధరాత్రి పడిగాపులు కాసిన కాలాన్ని ప్రజలు ఒకసారి గుర్తుంచుకోవాలని, అర్ధరాత్రి మోటార్లు వేయడానికి వెళ్లిన సమయాల్లో కరెంట్ షాక్కు, పాముకాటుకు గురై చనిపోయిన రైతు కుటుంబాల గోసను ప్రజలందరూ ఒకసారి స్మరించుకోవాలన్నారు. తెలంగాణ రైతాంగానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ సకాలానికి ఎరువులు , నాణ్యమైన విత్తనాలు, రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం వల్ల ఈరోజు రైతులు సగర్వంగా నేను రైతును అని చెప్పుకునే రోజులు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందరూ రుణపడి ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి తను చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కారేపల్లి క్రాస్ రోడ్ లోని పవర్ సబ్ స్టేషన్ ఎదురుగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మాళోత్ శకుంతలా కిషోర్, జెడ్పిటిసి వాంకుడొత్ జగన్ నాయక్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల రైతు బంధు కన్వీనర్ ఈసాల నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, నాయకులు ముత్యాల సత్యనారాయణ, ముత్యాల వెంకట అప్పారావు, తోటకూరి పిచ్చయ్య, శివరాత్రి అచ్చయ్య, అడపా పుల్లారావు, డేగల ఉపేందర్, ఈదర కోటేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భూక్యా రంగారావు, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు ధారావత్ పాండ్యా నాయక్, మాణిక్యారం ఉపసర్పంచ్ భూక్యా చాందిని, ఆదెర్ల రామారావు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పార్టీ కార్యాలయ ఇంచార్జి తొగరు శ్రీను, వివిధ హోదాలో ఉన్న నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News