Wednesday, May 8, 2024

ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 46

- Advertisement -
- Advertisement -

Eight bodies were recovered at Tapovan and Raini hydropower plants

 

వెలుగుచూసిన ఎనిమిది మృతదేహాలు

డెహ్రాడూన్/ తపోవన్ : ఉత్తరాఖండ్‌లో ఇటీవలి హిమ శకలాల వైపరీత్యంలో మృతుల సంఖ్య 46కు చేరింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న తపోవన్, రైనీ జల విద్యుత్ కేంద్రాల వద్ద ఆదివారం ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రాంతం అంతా ఇప్పటికీ జలమయం అయి ఉంది. బురద, నీళ్లలో చిక్కుపడ్డ వారిని కనుగొనేందుకు ఈ ప్రాంతంలో సహాయక చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. ఎన్‌టిపిసికి చెందిన 520 ఎండబ్లు తపోవన్ విష్ణుగద్ ప్రాజెక్టు వద్ద ఉన్న టన్నెల్ నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశారు. టన్నెల్ నుంచి మృతదేహాలను వెలికితీయడం ఇదే తొలిసారి.

వారం రోజులుగా టన్నెల్‌లో చిక్కుపడ్డ వారి ఆచూకి కనుగొనేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఓ ముగ్గురిని రైనీ ప్రాజెక్టు వద్ద చనిపోయి ఉండగా కనుగొన్నారు. రిషిగంగా నది ప్రవాహం వెంబడి ఆకస్మిక వరదలతో ఈ ప్రాంతంలోని హైడల్ ప్రాజెక్టులు కొట్టుకుపొయ్యాయి. భారీ నష్టం వాటిల్లింది. ఆదివారానికి మొత్తం మృతుల సంఖ్య 46కు చేరింది. ఇప్పటికీ 158 మంది జాడతెలియడం లేదని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారికి తక్షణ వైద్య చికిత్సల ఏర్పాట్లు చేసినట్లు, ఓ హెలీకాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చమోలీ జిల్లా కలెక్టర్ స్వాతి ఎస్ భదూరియా తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News