Wednesday, May 15, 2024

జంగల్ విఠోబా ఆలయంలో ప్రారంభమైన ఏకాదశి పూజా మహోత్సవాలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఉస్మాన్‌షాహీలోని చారిత్మ్రాక జంగల్ విఠోబా ఆలయంలో ఆషాడమాస తొలి ఏకాదశి పూజా మహోత్సవాలు ఘనం గా ప్రా రంభమయ్యాయి. పూజా మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ విఠలేశ్వర బాలభక్త సమాజం ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవాన్ని అంగ రంగ వైభ వంగా నిర్వహించేందుకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛై ర్మెన్ జి శంకర్‌యాదవ్, అధ్యక్షులు వి కిషన్‌యాదవ్‌లు తెలిపా రు. ఈ మేరకు బుధవారం ఆయన ఆలయ కమిటీ ప్రతినిధులు మాణిక్‌రావు, పాండుయాదవ్, ఆలయ అర్చకులు గోవింద్‌రాజ్ మహరాజ్‌లతో కలిసి స్వా మివారికి, గో మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గురువారం నిర్వ హిం చనున ్న పూజా కార్యక్రమాలు, రథోత్సవ వివరాలను వె ల్లడించారు. ఏకాదశి పూజా మహోత్సవాల సందర్బంగా నేటి నుంచి జులై 6వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఆలయానికి వచ్చే భక్తు లకు తీర్ద, ప్రసాద వితరణతో పాటు ఆలయ ప్రాంగణంలోఅన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తె లి పారు. 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వామివారి గరుడ సేవ అనం త రం శేష వాహనంపై శ్రీవిఠలేశ్వర, రుక్మాబాయిల రథోత్సవ కార్యక్రమం పు రవీధుల్లో ఊరేగించనున్నట్లు వివరించారు.

స్వామి వారి ఊరేగింపు ఉస్మాన్ షాహీ నుండి అఫ్జల్‌గంజ్ పాత పోలీస్‌స్టేషన్, మున్నాలాల్ దవాసాజ్, శం కర్‌షేర్ హోటల్, గౌలిగూడ ఛమన్ మీదు గా, పాత బస్ డి పోల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుందని వెల్లడించారు. దాదాపు 10 వేలమంది భక్తులు పాల్గొంటారన్న అంచనాతో భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా, రో డ్లపై ట్రాఫిక్‌జామ్ సమస్యలు తలెత్తకుండా ఆలయకమిటీ తరపున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వి వరించారు. ప్రతీ యేటా మాదిరిగానే ఈ యేడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ విఠలేశ్వర స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హా జరై, విఠలేశ్వరుని కృపకు పాత్రులు కావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News