Saturday, May 4, 2024

వీడియో కాల్‌లో నగ్నంగా మహిళ: మోసపోయిన వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడినందుకు ఒక వృద్ధుడి నుంచి బెదిరించి రూ. 12.8 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన బర్ఖత్ ఖాన్(32), రిజ్వాన్(22)లను ఢిల్లీలోని షాదారాకు చెందిన సైబర్ సెల్ బృందం మంగళవారం అరెస్టు చేసింది.

ఈ ఏడాది జులై 18న ఢిల్లీకి చెందిన ఒక వృద్ధుడికి వాట్సాప్‌లో వీడియో కాల్ వచ్చింది. ఓపెన్ చేయగా నగ్నంగా కూర్చుని ఒక మహిళ కనిపించింది. ఆ వృద్ధుడు షాక్ నుంచి తేరుకునేలోపే ఆమె బాధితుడి ముఖాన్ని స్క్రీన్‌షాట్ తీసింది.

కొద్ది సేపటికే ఆయనకు వివిధ మొబైల్ నంబర్ల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. తాము ఢిల్లీ సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నామని, తమకు డబ్బు చెల్లించకపోతే స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేస్తామనిఆ వ్యక్తులు బెదిరించారు. అయితే వారి బెదిరింపులకు ఆయన లొంగలేదు. దీంతో వారు ఆ మహిళ ఫోటోను ఆయన ఫోన్‌కు పంపారు. అందులో ఆ మహిళ ఉరేసుకుని మరణించి ఉంది. ఈ ఫోటోను చూపించి మళ్లీ బెదిరించడంతో వాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు ఆయన రూ. 12,80,000 ట్రాన్స్‌ఫర్ చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు తమ బృందాన్ని రాజస్థాన్‌కు పంపించి అల్వార్ నుంచి నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, అనేక సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి రోహిత్ మీనా తెలిపారు.

వీడియో కాల్స్ ద్వారా ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఇంటరాగేషన్‌లో నిందితులు ఒప్పుకున్నారని, దీని వెనుక పెద్ద సిండికేట్ ఉందని డిసిపి తెలిపారు. అనేక చోట్ల దాడులు జరిపినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News