Wednesday, May 15, 2024

విశాల సామ్రాజ్య ప్రాప్తిరస్తు

- Advertisement -
- Advertisement -
కేసీఆర్ కు వేద పండితుల ఆశీర్వచనం…
దిగ్విజయంగా రాజశ్యామల యాగం పరిసమాప్తి

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు నిర్వహించిన రాజశ్యామలయాగం విజయవంతంగా పూర్తయింది. యాగం పరిసమాప్తి అయిన అనంతరం, కేసీఆర్ దంపతులకు వేద పండితులు మహదాశీర్వచనం అందిస్తూ, ‘విశాల సామ్రాజ్య ప్రాప్తిరస్తు’ అని దీవించారు. తెలంగాణ శాంతియుతంగా, సుభిక్షంగా వర్థిల్లాలనీ, హైదరాబాద్ నగరం ముంబాయి, ఢిల్లీ నగరాలను దాటి అభివృద్ధి చెందాలనీ ఆశీర్వదించారు.

Rajashyamala Yagam ends with great successయాగశాలలో చివరి రోజు రాజశ్యామల అమ్మవారు నర్తన కాళి అవతారంలో దర్శనమిచ్చారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షించారు. పూర్ణాహుతి ముహూర్త సమయానికి రాజశ్యామల అమ్మవారి మంత్రాలను మూడు లక్షల సార్లు హవనం అయ్యేలా పండితులతో చర్చించారు. కుంభోద్వాసన చేసిన అనంతరం యాగంలో మంత్రించిన జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులపై చల్లారు.

Rajashyamala Yagam ends with great successఅలాగే యాగ భస్మాన్ని కేసీఆర్‌ నుదుట దిద్దారు. యాగం ప్రారంభానికి ముందు కేసీఆర్‌ దంపతులు ధరించిన కంకణాలను యాగశాలలో కంకణ విసర్జన ద్వారా పీఠాధిపతులకు అందించారు. దీంతో రాజశ్యామల యాగం పరిసమాప్తమైంది. వేద పండితులు మహదాశీర్వచనం అందించిన తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్‌ పాదపూజ చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి రప్పించిన రాజశ్యామల అమ్మవారి శేష వస్త్రాలను సీఎం దంపతులకు అందించారు. శుభసూచికంగా పండితులంతా పసుపు వస్త్రాలను ధరించి యాగశాలకు హాజరయ్యారు.

Rajashyamala Yagam ends with great success

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News