Saturday, May 4, 2024

ఐటి హబ్‌తో వేలాది నిరుద్యోగ యువతకు ఉపాధి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: నగరంలో ఐటి హబ్, నూతన మున్సిపల్ భవనం, మినీట్యాంక్ బండ్ ప్రారంభోత్సవానికి తొందరలో మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ రానున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఐటిహబ్, నూతన మున్సిపల్ భవన్, మినీ ట్యాంక్‌బండ్, దుబ్బ, అర్సపల్లిలో నిర్మించిన వైకుంఠధామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఐటి హబ్‌ను నిర్మించామని, దీంతో వేలాది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడం జరుగుతుందన్నారు.

ఇక నగరంలో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పూర్తయిందని, ఇక్కడ పచ్చదనం విరజల్లేలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవిధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్, సరికొత్త డిజైన్‌లతో సకల సదుపాయాలతో మాడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు సులభతరమైన సేవలు అందించడానికి ఆధునిక హంగులతో నూతన మున్సిపల్ భవనాన్ని నిర్మించామన్నారు. తెలంగాణ సంస్కృతి, సంపద్రాయాలకు, కవులకు, కళాకారులకు, రచయితలకు నిలయంగా నిజామాబాద్ నగరంలో కళాభారతిని నిర్మిస్తున్నామన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రఘునాథ చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్ నిర్మించామన్నారు. చివరి మజిలీ ఘనంగా నిర్వహించేందుకు ఆధునిక సదుపాయాలతో హైదరాబాద్ తరహాలో నగరంలో వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ దండునీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఊర పండుగ ఏర్పాట్ల పరిశీలన
నగరంలో ఈనెల 9న ఊర పండుగ నిర్వహిస్తున్నందున ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, అధికారులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి పత్రీక అయిన ఊర పండుగను శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారి గద్దె వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేయాలని సర్వసమాజ్ కమిటీ విజ్ఞప్తి మేరకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరగా నిధులను మంజూరు చేశారు.

అలాగే ఊర పండుగకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దేవతామూర్తులు ఊరేగింపుగా వచ్చే మార్గంలో స్పెషల్ సానిటేషన్ లైవ్ నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్వసమాజ్ కమిటీ అధ్యక్షులు బంటు రాజేశ్వర్, రామూర్తి గంగాధర్, రామడ్గు బాలకిషన్, పుప్పాల రవి, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News