Thursday, August 7, 2025

భారీగా లంచం తీసుకుంటూ.. ఎసిబికి దొరికేసిన ఇఎన్‌సి

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఎంత మంది లంచం తీసుకుంటూ దొరికిపోతున్న మిగితా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతీ రోజు ఎవరో ఒకరు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులకు దొరికిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో ఎసిబికి మరో లంచగొండి దొరికిపోయారు. విజయవాడలో (Vijayawada) గిరిజన సంక్షేమశాఖలో ఇఎన్‌సిగా విధులు నిర్వహిస్తున్న అబ్బవరపు శ్రీనివాస్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు.

గుత్తేదారు కృష్ణంరాజు నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ శ్రీనివాస్ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే కృష్ణంరాజు రూ.25 లక్షలు లంచంగా సమర్పించుకున్నారు. కానీ, శ్రీనివాస్ ఆశ అంతటితో ఆగలేదు. మరో రూ.25 లక్షలు కావాలని అడిగారు. దీంతో కృష్ణం రాజు ఎసిబి అధికారులను అశ్రయించారు. ఎసిబి అధికారులు వలపన్ని ఇఎన్‌సిని పట్టుకున్నారు. గతంలో కూడా మూడుసార్లు శ్రీనివాస్ ఎసిబికి చిక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News