Monday, May 6, 2024

ఘట్కేసర్‌లో దారుణం: ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Engineering Student raped by Auto Driver in Ghatkesar

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. రాష్ట్రంలోని మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ జోడిమెట్ల వద్ద ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా అపహరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం దుస్తులు లేకుండా యువతిని రహదారిపై వదిలి వెళ్లాడు. మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. బాధితురాలి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు ఆటో డ్రైవర్ ఒక్కరే కారణమా? అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Engineering Student raped by Auto Driver in Ghatkesar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News